అంబేద్కర్ విగ్రహానికి వై.సి.పి నేతల ఘన నివాళులు

అంబేద్కర్ విగ్రహానికి వై.సి.పి నేతల ఘన నివాళులు


వింజమూరు, ఏప్రిల్ 14 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 129 వ జయంతిని పురస్కరించుకుని వింజమూరులోని బంగ్లాసెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వై.సి.పి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై.సి.పి మండల కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి మాట్లాడుతూ భరత జాతి గర్వించదగిన వ్యక్రిగా అంబేద్కర్ ను అభివర్ణించారు. నాటి రాజ్యాంగ నిర్మాణం ఫలితమే ప్రస్తుతం బడుగు బలహీన వర్గాల ప్రజల ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయడం జరిగిందన్నారు. వై.సి.పి మాజీ మండల కన్వీనర్ పల్లాల.కొండారెడ్డి మాట్లాడుతూ పేదరిక కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతలతో ఉన్నత విద్యను అభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడటం సంతోషదాయకమన్నారు. ఆయన ఆశయాలు, స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆకాం క్షించారు.