జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్

*20–04–2020*
*అమరావతి*


అమరావతి: జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌
ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి
ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలే: సీఎం
కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం:
ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి: 
ఇప్పుడు రంజాన్‌ కూడా వచ్చింది:
ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి:
ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నా:
ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి
ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి: సీఎం