కృష్ణలంక ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్ ఇంతియాజ్, సిపి ద్వారకా తిరుమలరావు

విజయవాడ


కృష్ణలంక ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్ ఇంతియాజ్, సిపి ద్వారకా తిరుమలరావు


ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాహనాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించిన పోలీసులు


*ఇంతియాజ్.. కలెక్టర్*


విజయవాడ లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి


మేము  చర్యలను తీసుకున్నా.. ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదు


కృష్ణలంక, కార్మిక నగర్, ఖుద్దూస్  నగర్ ప్రాంతాలలో కేసులు ఎక్కువుగా వచ్చాయి


ఈ ప్రాంతాలలో సామూహిక సమావేశాలు పెట్టడం వల్లే కరోనా వ్యాప్తి


ఒక్కోక్క వ్యక్తి ద్వారా 20మందికి సోకినట్లు సమాచారం


ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి స్వీయ నియంత్రణ పాటించాలి


జిల్లాలో 7,500 మందికి పరీక్షలు చేస్తే 170మందికి  పాజిటీవ్  వచ్చింది


ప్రజలు నిర్లక్ష్యం తో ఉంటే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృధానే


*సిపి ద్వారకా తిరుమలరావు*


విజయవాడ లో ఇప్పటి వరకు 150 కి పైగా పాజిటీవ్  కేసులు‌ వచ్చాయి.ఎవరూ కరోనాను తేలికగా తీసుకో వద్దని కోరుతున్నాం


 


.పోలీసులు, రెవిన్యూ, వాలంటీర్ లు, వైద్యులు, నర్సులు లు విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు.వారికి హ్యాట్సాఫ్ చెప్పాలి.. వారికి వ్యాప్తి  చెందితే సానుభూతి చూపి, బాసటగా ఉండాలి.విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి, మరో లారీ డ్రైవర్ ద్వారా కేసులు భారీగా పెరిగాయి.బాధ్యత రాహిత్యం గా వ్యవహరించిన వారిద్దరి పై క్రిమినల్ కేసులు నమోదు చేశాం.. చర్యలు తీసుకుంటాం.ఎవరూ బయటకు రాకూడదు.. ఇష్టం వచ్చినట్లు వస్తే ఇక ఊరుకోం.కొంతమంది పోలీసులు చర్యలను ప్రశ్నిస్తున్నారు.. ‌మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం.కృష్ణలంక ప్రాంతం లో సిసి కెమెరాలు పెట్టి ప్రజల రాకపోకల పై పర్యవేక్షణ చేస్తాం.అంతర్గత మార్గాలలో ప్రజల రవాణా పై డ్రోన్ కెమెరా లతో నిఘా పెడతాం.కరోనా కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయి.Apsdrf బృందాలను కూడా రంగంలోకి దించాం.లాక్ డౌన్ నిబంధనలు పాటించాలి.. అతిక్రమణ చేస్తే.. చర్యలు ఉంటాయి