డోర్ టు డోర్  పకడ్బంధీగా  చేపట్టాలి : గుంటూరు జిల్లా కలెక్టర్   ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్

 


గుంటూరు, ఏప్రిల్ 26-2020:- క్లస్టర్ కంటైన్మేంట్ లో కరోనా వైరస్ వ్యాప్తి స్థాయి తెలుసుకునేందుకు ఫీల్డ్ సర్వే లెన్స్ ను  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డోర్ టు డోర్  పకడ్బంధీగా  చేపట్టాలని జిల్లా కలెక్టర్   ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పెర్కొన్నారు.


     ఆదివారం స్థానిక ఆనందపేట, చాకలిగుంటలోని క్లస్టర్ కంటైన్మేంట్ ను జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు డా. కమల్ రాజు తో కలసి పరిశీలించారు. కంటైన్మేంట్ క్లస్టర్లలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు, కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు వున్న వారిని గుర్తించేందుకు క్లస్టర్ కంటైన్మేంట్ లో నియమించిన వైద్య అధికారులు నిర్వహిస్తున్న ఫీల్డ్ సర్వే లెన్స్ జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాల నుండి,  చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చిన తరువాత ఆసుపత్రుల నుండి డిశ్చార్ అయిన వ్యక్తులు, హోం ఐసోలేషన్ లో వుండేలా పర్యవేక్షించాలన్నారు. కంటైన్మేంట్ ప్రాంతాలలో చేస్తున్న శాంపిల్స్ పరీక్షలలో దీర్ఘకాలిక రోగాలు వున్న వృద్దులకు, అనుమానిత వున్న వారికి ప్రాధాన్యతనిచ్చి పరీక్షలు నిర్వహించాలన్నారు. కంట్రోల్ రూముకు మందుల కోసం కాల్ చేస్తున్న వారి పూర్తి వివరాలు, రోగ లక్షణాలు, వినియోగిస్తున్న మందులు గురించి తెలుసుకోవాలన్నారు. వైద్య అధికారులు కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు వున్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే ఫీల్డ్ సర్వే లెన్స్ టీమ్స్ కు సమాచారం అందించి, వారికి శాంపిల్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్ కంటైన్మేంట్ కంట్రోలు రూములలో వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు అవసరమైన ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సిద్దంగా వుంచుకోవాలన్నారు. 


     అనంతరం  జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు డా. కమల్ రాజు ఆనంద పేటలో రెడ్ క్రాస్ వాలంటీర్ల  ఆధ్వర్యంలో ముస్లీంలు రంజాన్ ప్రత్యేక ప్రార్ధనలు ఇళ్ళలోనే వుండి నిర్వహించుకోవాలని మొబైల్ పబ్లిక్ అడ్రస్ సిస్టం  ద్వారా నిర్వహిస్తున్న ప్రచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు ఇళ్లలోనే వుండి ప్రార్ధనలు నిర్వహించుకోవాలన్నారు.  ప్రతి వ్యక్తి  ఆరోగ్యపరమైన డేటాను అప్ లోడ్ చేసేందుకు మాత్రమే ఆధార్ కార్డు నంబర్లు అడుగుతున్నామని, ప్రజలందరూ ఆధార కార్డు నంబర్లు తెలిపి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.  


     కార్యక్రమంలో గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ, సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్,  తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి, నగరపాలక సంస్థ  కమీషనర్ చల్లా అనురాధ, వైద్య ఆరోగ్య, రెవిన్యూ, మునిసిపల్ శాఖ ఆధికారులు  తదితరులు పాల్గొన్నారు.
శాా


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image