కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా చేగువేర ఫౌండేషన్

*అందరి సహకారంతో అత్యవసర పరిస్థితిని అధిగమిద్దాం**కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా చేగువేర ఫౌండేషన్*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి,మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం**చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 మంది ఉత్తరప్రదేశ్‌ వలస వ్యాపారులకు 15 రోజులకు సరిపడ ఫల సరుకులు పంపిణీ**కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ ఈ కష్ట కాలాన్ని ప్రజలందరి సహకారంతో అధిగమిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్స్ కేంద్ర పాలక మండలి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి,ఎం.డబ్ల్యూ.ఎన్. డబ్ల్యూ అధ్యక్షులు,ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం అన్నారు.గూడూరు రెండో పట్టణ పరిధిలోని కోర్టుసెంటర్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస వ్యాపారులకు,కార్మికులకు చేగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు అందజేశారు.చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు ఆదక్షతన శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.అనంతరం చింపిరి నాయుడు కాలువ కట్ట,వంకిన గుంట కట్ట ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రాంభించారు.ఈ సందర్భంగా ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 10 రోజులుగా చేగువేర ఫౌండేషన్ నిరాశ్రయులను,ప్రజలను అన్ని విధాలా ఆదుకుంతుందని ఒక పక్క ఆహారం,మరో పక్క పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తనవంతుగా కృషి చేస్తుందన్నారు.అబ్దుల్ రహీం మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ఎంతో మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు.ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉపాది కోసం వెళ్లి ఏంతో మంది ఎటూ పోలేక చిక్కుకుని పోయారన్నారు.అలాంటి వారికి స్వచంద సంస్థలు అండగా నిలవడం అభినందనీయమన్నారు.మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ దేశం కోసం మనమందరం ఈ సమయంలో ఒక్క తాటిపై నిలవలన్నారు.ఎన్నో ప్రాణాంత వ్యాధులను మన దేశ ప్రజలు తరిమికొట్టారని కొరోనాను కూడా తరిమికొట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్,మధు రెడ్డి,అన్సర్ బాష, నరేష్ రెడ్డి పైలట్ టీమ్ వినోద్,పవన్,భాస్కర్,అజయ్,సంతన్, సాయి,మహేష్,లక్ష్మీ నారాయణ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు*