జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

‘జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
ప్రకాశం : కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేసిన బియ్యం, నూనెల్లో నాణ్యత లేకపోవడం బాధాకరం అన్నారు. జర్నలిస్టులకు ఇటువంటి సరుకులు పంపిణీ చేయటం పట్ల వారు దిగ్భ్రాంతికి గురయ్యారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంచి మనసుతో జర్నలిస్టులకు మంచి చేయాలని కలెక్టర్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడితే.. క్రింది స్థాయి సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పంపిణీ కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు కావడానికి కారకులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు.