పుదుచ్చేరి: మంత్రి మల్లాడి విజయం
- కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నిన్న దీక్ష చేపట్టిన ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు
- లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా గవర్నర్ కిరణ్ బేడీ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి మల్లాడి
- గవర్నర్ నిర్ణయాలపై ప్రధాని, పుదుచ్చేరి సీఎం, అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన మంత్రి మల్లాడి
- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాం వాసులను క్వారంటైన్ చేయకుండా, ఆసుపత్రికి పంపించకుండా మూడు రోజులపాటు ఆంధ్ర బార్డర్ లో చెక్ పోస్ట్ వద్ద నిలుపుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లాడి కృష్ణారావు
- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని 24 గంటల్లో క్వారంటైన్ కు తరలించకపోతే పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి వైదొలుగుతానని అల్టిమేటం ఇచ్చిన మల్లాడి
- నిన్న పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేపట్టిన మంత్రి మల్లాడి కృష్ణారావు
- మంత్రి చేపట్టిన దీక్షకు దిగి వచ్చిన కేంద్రం
- యానాం వాసులతో పాటు మిగతా వలస కార్మికులకు కూడా .. వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని.. దీక్ష విరమింప చేయాలని కేంద్రం నుంచి పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వా మికి ఉత్తర్వులు అందడంతో.. దీక్ష విరమించిన మంత్రి మల్లాడి కృష్ణారావు
- యానాం వాసులే కాకుండా, నిలిచిపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు వెళ్లడానికి పచ్చ జెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం
- యానాం ప్రజల కోసం మంత్రి మల్లాడి కృష్ణారావు చేపట్టిన దీక్ష.. చివరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు, పర్యాటకులకు, విద్యార్థులకు ఊరటనిచ్చిన కేంద్రం
- లాక్ డౌన్ నిబంధనలను సవరిస్తూ నిన్న సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఉత్తర్వులు జారీ
- మంత్రి మల్లాడి కృష్ణారావు చేపట్టిన దీక్షకు.. కేంద్రం స్పందించి.. లాక్ డౌన్ నిబంధనలను సవరిస్తూ జీవో జారీ చేయడంతో.. మంత్రి మల్లాడి విజయం సాధించారని ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపిన మత్స్యకారులు, వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.