భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరోనా నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన 40వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..


నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరిగింది.


ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ వ్యవస్థాపకులు,సైద్ధాంతిక కర్తలు శ్రీ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ,శ్రీ దీన దయళ్ ఉపాధ్యాయ గారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి పుష్పాంజలి ఘటించారు. 


అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో  నూతన భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి నమఃసుమాంజలి అర్పించారు.అలాగే వారి స్వగృహంలో కూడా నూతన పార్టీ జెండాను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే పార్టీ అధిష్టానం సూచించిన కార్యక్రమాలను విధిగా ప్రతీ కార్యకర్త అమలు చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో అతికొద్ది మంది స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.