ప్రజల్లో తీవ్ర భయం, ఆందోళన కలిగించరాదు...: ముఖ్యమంత్రి

*26–04–2020*
*అమరావతి*


*సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌


*గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను రప్పించడంపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో చర్చ.


*పొగాకు కొనుగోలుకు సీఎం ఆదేశం*


*కోవిడ్‌–19 నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారందరికీ కూడా రూ.2వేలు*


*ప్రజారోగ్య రంగంలో పూర్తి మౌలిక సదుపాయాలు*


*కోవిడ్‌–19 నివారణపై సీఎం సమీక్షా సమావేశం:*


అమరావతి: 
– కోవిడ్‌ – 19 నివారణా చర్యలపై తన నివాసంలో
సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
– వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు


*సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌*


– కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తనకు ఫోన్‌చేసిన విషయాన్ని అధికారులకు తెలియజేసిన సీఎం.
– ఏప్రిల్‌ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై చర్చ.
– లాక్‌డౌన్‌ పరిణామాలు, దీనితర్వాత అనుసరించిన వ్యూహాలపై చర్చ.
– రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌
– రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన సీఎం.
– ప్రతి మిలియన్‌ జనాభాకు 1274 చొప్పునఅత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్న సీఎం


*గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను రప్పించడంపై చర్చ*


– గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను తెప్పించడంపై ఇప్పటికే తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కోవిడ్‌–19 నివారణా చర్యలకోసం రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్‌ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్‌తో ఫోన్‌లో మాట్లాడానన్న సీఎం. 
– రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ అధికారి సతీష్‌ చంద్ర చూసుకుంటారంటూ తాను కేంద్ర మంత్రికి తెలియజేశానని, ఆమేరకు ఆమె∙కార్యాలయం నుంచి కూడా ఒక అధికారిని అప్పగించారని తెలిపిన సీఎం. 
– ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి.. తెలుగు మత్స్యకారులను గుజరాత్‌ నుంచి ఏపీకి తీసుకు వచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తానంటూ నిర్మలా సీతారామన్‌ చెప్పారన్న ముఖ్యమంత్రి. 
– సముద్రమార్గం ద్వారా తీసుకురావడానికి ప్రయాణికుల నౌకకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖనుంచి, సంబంధిత విభాగాలనుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉందని, దీనికి చాలా సమయం పడుతుందని అధికారులు నివేదించిన నేపథ్యంలో ఈ ప్రయత్నాలు చేసినట్టు తెలిపిన సీఎం


*పొగాకు కొనుగోలుకు సీఎం ఆదేశం*


– రైతులు నష్టపోకుండా వెంటనే పొగాకును కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం.
– ప్రకాశం జిల్లాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు రెడ్‌జోన్లలో ఉన్నందున 
టంగుటూరు, కొండెపిల్లో ప్రత్యామ్నాయ వేలంపాట కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం.
– అలాగే పశ్చిమగోదావరి  జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా పొగాకు కొనుగోలు కోసం వేలంపాట కేంద్రాలు నిర్వహించాలని ఆదేశం. 
– రేపటినుంచి వేలపాటలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి. 
– స్వయంగా పర్యవేక్షించాలని ప్రకాశం, ప.గో. జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు. 


*కోవిడ్‌–19 నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారందరికీ కూడా రూ.2వేలరూపాయలు*


– రాష్ట్రవ్యాప్తంగా 231 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారని తెలిపిన అధికారులు 
– వీరందరికీ రూ.2వేల రూపాయలు చొప్పున అందించాలని సీఎం ఆదేశం
ఇప్పటికే కొంతమందికి అందించామని, మిగిలిన వారికి కూడా అందిస్తామని తెలిపిన అధికారులు.
– రాష్ట్రవ్యాప్తంగా కేసుల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు.
– విజయవాడలో కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగా కృష్ణలంకలోని ఒక వీధిలో, కార్మికనగర్‌లోని ఒక వీధిలో కేసులు వచ్చాయని తెలిపిన అధికారులు.
– అలాగే పశ్చిమగోదావరిలో కూడా ఢిల్లీనుంచి వచ్చిన వ్యక్తి కారణంగా వ్యాపించిందని తెలిపిన అధికారులు.
– టెస్టులు సంతృప్తికర స్థాయిలో నిర్వహించి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపిన అధికారులు.
– దీనివల్ల రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితి ఏంటి? ఏరకంగా ప్రభావం చూపుతోంది? హైరిస్క్‌ ఉన్నవారిపై వైరస్‌ చూపించే ప్రభావం తదితర అంశాలను తెలుసుకునేందుకు విస్తృతంగా నిర్వహించిన పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయని వెల్లడించిన అధికారులు. 
– లాక్‌డౌన్‌ అనంతరం తీసుకునే నిర్ణయాలు, ఆతర్వాత పరిణామాల్లో భాగంగా ఎలాంటి వైద్య పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్నదానికి ఈ అధ్యయనం, విశ్లేషణలు తోడ్పాటునందిస్తాయని తెలిపిన అధికారులు


*ప్రజల్లో తీవ్ర భయం, ఆందోళన కలిగించరాదు...*


– కరోనా వైరస్‌పై వివిధ ప్రసారమాధ్యమాలు ప్రజల్లో కలిగించిన తీవ్ర ఆందోళన వల్ల సామాజికంగా చోటుచేసుకున్న విపరిణామాలపై సమావేశంలో చర్చ. 
– వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు స్థానంలో... ప్రజల్లో తీవ్ర భయాందోళనలు, లేనిపోని అపోహలను కలిగించడంపై విచారం వ్యక్తంచేసిన అధికారులు.
– కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లినా స్థానికులు అడ్డుకోవడం, చివరకు అది ఉద్రిక్తతకు దారితీసిన ఒకటిరెండు ఘటనలను కూడా సమావేశంలో వివరించిన అధికారులు. 
– ఆత్మీయత, మానవత్వం పోయి వివక్ష, విద్వేషం, తక్కువగా చూడ్డం లాంటి భావనలు తలెత్తేలా అక్కడక్కడా చోటుచేసుకున్న పరిణామాలను సీఎం దృష్టికి తీసుకు వచ్చిన అధికారులు. 
– కొన్ని మీడియా సంస్థలు విపరీత పోకడ, తీవ్ర ఆందోళన కలిగించేలా ప్రచారం చేస్తుండడం దీనికి కారణమని సమావేశంలో ప్రస్తావించిన వైద్య నిపుణులు. 
– ప్రజల్లో తీవ్ర ఆందోళన బదులు ధైర్యం, భరోసా, స్థైర్యం, అవగాహన, జాగ్రత్తలు పాటించేలా, చైతన్యం కలిగించేలా మరిన్ని అడుగులు ముందుకేయాలని సీఎం ఆదేశం. 


*ప్రజారోగ్య రంగంలో ముమ్మరంగా మౌలిక సదుపాయాలు:*


– కోవిడ్‌ –19 లాంటి విపత్తను ఎదుర్కోవాలంటే ఆరోగ్యం రంగంలో మౌలికసదుపాయాల కల్పన ముమ్మరంగా సాగాలని స్పష్టంచేసిన సీఎం.
– నాడు – నేడు కింద ప్రతిపాదించిన పనులన్నీ పూర్తిచేయాలని స్పష్టంచేసిన సీఎం.
– కోవిడ్‌ –19లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే మౌలిక ఆరోగ్య రంగంలో మౌలికసదుపాయాల కల్పన చాలా అత్యవసరమని, దానిద్వారానే వివిధ రోగాలనుంచి ప్రజల ప్రాణాలు నిలుపుకోగలమన్న ముఖ్యమంత్రి. 
– కోవిడ్‌–19 యేతర ఎమర్జెన్సీ కేసులపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. అత్యవసర సేవలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదన్న సీఎం. 
– ప్రణాళిక ప్రకారం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులు భర్తీచేయాలన్న సీఎం. దీనికి సిద్ధమవుతున్నామన్న అధికారులు. 


*మాస్క్‌ల పంపిణీపైనా ఆరా*


– మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రమైన వస్త్రాన్ని కప్పుకోవడం లాంటి చర్యలు మేలుచేస్తాయని సమావేశంలో సూచించిన వైద్య నిపుణులు
– రాష్ట్రంలో ప్రతి మనిషికీ మూడు మాస్కుల చొప్పున పంపిణి పై ఆరాతీసిన సీఎం– ఇప్పటికే 1.3 కోట్లకుపైగా మాస్క్‌లను రెడ్‌ క్లస్టర్లలో పంపిణీచేశామన్న అధికారులు.
– రోజుకు 40 లక్షల చొప్పున మాస్క్‌లు తయారు చేస్తున్నామని, అత్యంత వేగంగా పంపిణి కార్యక్రమం జరుగుతోందని వెల్లడించిన అధికారులు.
- డ్వాక్రా సంఘాలుకు ఇవ్వడంవల్ల వారికి కష్టకాలలో ఉపాధికూడా కలిగిందని. మాస్క్ ల తయారీ, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్న సీఎం.


Popular posts
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం
Image