గూడూరు ఏప్రిల్ 9 : గూడూరు నియోజకవర్గం అయిన నెల్లటూరు అలాగే చిల్లకూరు నందు ఉన్న గిరిజన కాలనీలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య గూడూరు వారి ఆధ్వర్యం లో మధ్యాహ్నం భోజనం పంచి పెట్టడం జరిగింది.
ఈ విషయం అయ్యి TNSF జిల్లా కార్యదర్శి అసనాపురం వెంటేష్ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఇళ్ళకే అందరూ పరిమితం అవ్వటం తో రోజు కూలి పనులకు పోయేవారికి భోజనం కూడా వండుకునే పరిస్థితి లేదని .. అందుకే మా వంతు సహాయంగా గత 05 రోజుల నుండి మధ్యాహ్నం భోజనం సరఫరా చేస్తున్నామని తెలియజేసారు . అలాగే మన గూడూరు పట్టణం లో కూడా 02 కరోన పోసిటివ్ కేసులు వచ్చాయని దయచేసి ప్రజలు ఎవరు ఇళ్ల నుండి అత్యవసర పరిస్తులో తప్ప బయటకు రావొద్దు అని తెలియజేసారు. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పిన సలహాలను పాటిద్దామని తెలియజేసారు .. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీను , సాయి,గురు , శశి ,గిరి , తదితరులు పాల్గొన్నారు..
తెలుగునాడు విద్యార్థి సమాఖ్య వారి ఆధ్వర్యం లో మధ్యాహ్నం భోజనం పంపిణీ