కరోనా వైరస్ పై  ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం

కరోనా వైరస్ పై  ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం
అమరావతి ఏప్రిల్25,(అంతిమ తీర్పు) : కరోనా వైరస్ పై శనివారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం. ఈ వీడియో సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ ఈనెల 20 నుండి లాక్ డౌన్ నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చిన మినహాయింపులు ఏవిధంగా అమలు చేస్తుంది రాష్ట్రాల వారీ సమీక్షించారు. అలాగే లాక్ డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలు, ఇతరులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.ఇంకా లాక్ డౌన్ అమలుకు సంబంధించిన పలు అంశాలపై ఆయన సిఎస్ లతో సమీక్షించారు.


* ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డిజి రవిశంకర్ అయ్యన్నార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, కార్యదర్శి పియూష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్,ఐజి ఎన్ఫోర్స్మెంట్ వినీత్ బ్రిజ్లాల్ తదితరులు.