తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది - ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పేద,బడుగు,బలహీన  వర్గాలకు ఎప్పుడు ఏ కష్టం  వచ్చిన  తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎమ్మెల్సీ *యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్* మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్*


పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురు మండలం కాటూరు గ్రామంలో మండల తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు దండమూడి పూజిత పర్యవేక్షణలో 1600 కుటుంబాలకు ఇంటింటికి పలు రకాల కూరగాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్* మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్* గార్లు 


ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని,లాక్ డౌన్ వలన ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటామని, ప్రతిపక్షంలో వున్నా కూడా  ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటు మీ కష్టాలు మా కష్టాలుగా భావిస్తామని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.


మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి పేదల జీవితాల్లో చీకటి నింపుతుంది అని, జీవన ఉపాధి లేక చాలా కుటుంబాలు పస్తులు వుంటున్నారని వారందరికీ మేము మన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని అయన అన్నారు. 


ఈ సందర్బంగా ఇంటింటికి కూరగాయలు పంచుతూ మంచి సేవా కార్యక్రమం చేస్తున్న దండమూడి చౌదరి, పూజిత లను *రాజేంద్ర ప్రసాద్* గారు *బోడే ప్రసాద్* గారు అభినందించారు. 


ఈ కార్యక్రమంలో ఉయ్యురు మండల పార్టీ అధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, కాటూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట నారాయణ, బాబూ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.