గుజరాత్ ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ
అమరావతి : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గుజరాత్‌లో చిక్కుకున్న దాదాపు 4వేల మంది తెలుగువారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగం, విశాఖ జిల్లాలకు చెందిన జాలర్లు గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిక్కుకున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయం ముగిసేవరకు వారికి గుజరాత్ రాష్ట్రంలో వసతి కల్పించటంతోపాటు అన్నపానీయాలు అందించాలని బాబు కోరారు. వారికి వైద్యం సదుపాయం అందించటంతో పాటు అవసరమైన నిత్యవసరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ వారి యోగక్షేమాల పట్ల కుటుంబసభ్యులు ఎంతో ఆందోళనతో ఉన్నారని వివరించిన లేఖలో చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా 4వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11మంది ఫోన్ నెంబర్లను తన లేఖలకు చంద్రబాబు జత చేసి పంపారు.
గుజరాత్ ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ