ఫాదర్ ఫెర్రర్ ఆశయాలను కొనసాగిద్దాం..
- మచ్చా రామలింగారెడ్డి
అనంతపురం ఏప్రిల్ 9 (అంతిమ తీర్పు): నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఫాదర్ ఫెర్రర్ 100వ జయంతి వేడుకలు. జిల్లా జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు ఉదయం ఆర్డిటి వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) పాల్గొని ఫాదర్ ఫెర్రర్ శిలాఫలకానికి పాలాభిషేకం చేశారు, ఫాదర్ ఫెర్రర్ జయంతి వేడుకలకు ఆజాద్, మారుతి నందు టైమ్స్ భాస్కర్ రెడ్డి, తేజ ప్రసాద్, జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రసాద్, ఫోటోగ్రాఫర్లు డ్యానీయల్, ఆనంద్ కుమార్ (sku) హరికృష్ణ, జిలాన్ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు హనుమంత్ రెడ్డి, నాగేంద్ర దిలీప్, రాజశేఖర్ చిన్న పత్రికల్లో అసోసియేషన్ నాయకులు సాయినాథ్ రెడ్డి, ఉపేంద్ర, కుల్లాయి స్వామి, మీడియా ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆదినారాయణ, శివానంద, అది, కృష్ణమూర్తి, నగరంలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఫాదర్ ఫెర్రర్ జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు.
మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జిల్లాకు ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి, జిల్లా ప్రజల హృదయాల్లో ఫాదర్ ఫెర్రర్ బతికే ఉంటాడని అన్నారు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కి ఫాథర్ ఫెర్రర్ చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు, ఆర్డిటి సంస్థ యాభై ఏళ్లుగా జిల్లాలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ ముందుకు వెళుతుందని అన్నారు.
కరోనా తో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు కోసం ఆర్డిటి సంస్థ అన్నే ఫెర్రర్, మాంచో ఫెర్రర్, విశాల ఫెర్రర్ 800 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్డీటీ సేవలు జర్నలిస్టులు అందరూ గుర్తించి వారికి మరింత సహకారం అందిస్తూ ఫాదర్ ఫెర్రర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.
💎DIST.. JOURNALIST DEVELOPMENT SOCIETY ANANTAPURAMU💎