స్వీయ నిర్భంధం ద్వారానే కరోనా వైరస్ కట్టడి : ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా  కౌశిక్

స్వీయ నిర్భంధం ద్వారానే కరోనా వైరస్ కట్టడి : ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా  కౌశిక్


. వింజమూరు, ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కోవిడ్-19 విజృంభణ నేపధ్యంలో ప్రజలు స్వీయ నిర్భంధం పాటించడం ద్వారానే కరోనా వైరస్ కట్టడి సాధ్యమవుతుందని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్  రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ అన్నారు. ఈ మేరకు గురువారం నాడు  సాయంత్రం వింజమూరులో ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దేశం మొత్తం మీద నెల రోజులుగా జరుగుతున్న లాక్ డౌన్ ప్రక్రియకు ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కౌశిక్ అన్నారు. ఈ కరోనా విస్తృతి నేపధ్యంలో రాష్ట్రంలో కె.జి టు పి.జి వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. అయితే గత కొన్ని రోజులుగా సెలవులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. రాబోవు విద్యా సంవత్సరానికి విద్యారంగంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు విద్యారంగంలో ఉన్నత స్థాయి సమీక్షలను ప్రభుత్వం నిర్వహించాల్సి ఉందని సూచించారు. విధ్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండా, ప్రమోట్ చేయకుండా ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించి ఆన్ లైన్ ద్వారానే పరీక్షల నిర్వహణను అమలుపరచాలని కోరారు.