రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా అంబేద్కర్ జయంతి వేడుక

దేశానికి అత్యున్నత రాజ్యాంగం అందించిన అంబేద్కర్  
*  ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌
* రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా అంబేద్కర్ జయంతి వేడుక 
విజ‌య‌వాడ‌:     ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్ అంబేద్కర్‌కు భారత దేశం కృతజ్ఞతలు తెలుపుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడుగా, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉంటారన్నారు. భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో నివాళి అర్పించారు. కరోనా నేపధ్యంలో అతి నిరాడంబరంగా, సామాజిక దూరాన్ని పాటిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.