నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..

కర్నూల్ :
కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మార్కజ్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్ అనుమానితులను వెంటనే గుర్తించండి. అత్యాదునిక, టెక్నాలజీని ఉపయోగించo డి. గుర్తించిన వారిని వెంటనే క్వారo టైన్ కు తరలింపుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టo డి. 
పాజిటివ్ అనుమానo వ్యక్తులరక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించడం కోసం ప్రత్యేక ద్రుష్టి పెట్టండి. పాజిటివ్ కేసులు పెరిగిన ప్రాంతంలో రెడ్ జోన్ గా గుర్తించి, ఎవరిని కూడా బైటికి రాకుండా చర్యలు తీసుకొండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్ లు గా గుర్తించి, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  మార్కజ్ సంబందీకులు ఉన్న ప్రాంతంలో జీయోట్యాగి o గ్ పనులు వేగవంతం చేయండి.  హోమ్ క్వార o టైన్ లో ఉంటున్న వారి పై ప్రత్యేకంగా వైద్య, ఆరోగ్య, ప్రభుత్వ బృందాలు నిఘా ఉంచాలి. క్వార o టైన్ లో ఉంటున్న వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు వ్యవహారి o చకుండా,, ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్య సిబ్బంది, వాలెంటీర్స్, నిఘా ఉంచాలి. లాక్ డౌన్ అమలులో కఠినంగా వ్యవహరించాలి. కరోనా కట్టడికి ప్రజలు సహకారం అందించడానికి అవగాహన కల్పించo డి....


అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలు ఇల్లల్లోనే ఉండాలి. అధికారులు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టండి.. 


ప్రభుత్వ నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు.... 


పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతంలో వారి ఇల్లు చుట్టూ ప్రక్కల కిలో మీటర్ పరిధి వరకు వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి ర్యాపిడ్ సెర్వే నిర్వహించడం కోసం టీమ్స్ ఏర్పాటు చేయాలి... 


AP డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.....