ఊటుకూరులో టి.డి.పి నేతలచే నిత్యావసరాలు పంపిణీ

ఊటుకూరులో టి.డి.పి నేతలచే నిత్యావసరాలు పంపిణీ


వింజమూరు, ఏప్రిల్ 13 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ఊటుకూరు ఎస్.సి, ఎస్.టి కాలనీలో నివసిస్తున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నేత వరికూటి.మాల్యాద్రిరెడ్డి నేతృత్వంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వింజమూరు మాజీ సొసైటీ అధ్యక్షులు గొంగటి.రఘునాధరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు చూపుతో వ్యవహరించి జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ లు విధించి ఈ వైరస్ ముమ్మరం కాకుండా అడ్డుకట్ట వేయడం అభినంచదగిన విషయమన్నారు. లాక్ డౌన్ వలన కూలీ పనులు వెళ్ళే వెసులుబాటు మృగ్యం కావడంతో వారి కుటుంబాల పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. కనుక వారందరికీ చేయూతనిచ్చేందుకు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని.వెంకటరామారావు పిలుపు మేరకు పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ యన్నం.రామచంద్రారెడ్డి, ఊటుకూరు టి.డి.పి యం.పి.టి.సి అభ్యర్ధి అంకి.పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.