మెడికల్ షాపుల యజమానులు మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి:ఆరోగ్య శాఖ

అమరావతి, ఏప్రిల్ 26 (అంతిమ తీర్పు) :


ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన లో కోవిడ్–19 వైరస్ వ్యాధి కట్టడికి  ఫార్మసీ యాప్ ను ఏర్పాటు చేశామని మెడికల్ షాపుల యజమానులు  తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి అని కోరారు.ఎంటర్ చేసిన మొబైల్ నంబరుకి ఒటిపి వస్తుంది.మొబైల్ నంబర్ లేదా మెడికల్ షాపు ఐడి నంబర్ ఎంటర్ చేయాలి.జ్వరం , దగ్గు , శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని   ఈ యాప్లో పొందుపర్చాలి.స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు  స్వయంగా చికిత్స అందిస్తారు.గూగుల్ ప్లే స్టోర్ నుంచి Covid 19 AP Pharma యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కొవిడ్ పై పోరాటంలో మెడికల్ షాపుల యజమానులు ప్రభుత్వానికి సహకరించాలి అని ఏ. పీ వైద్య.  ఆరోగ్య శాఖ ఒక ప్రకటన లో తెలిపింది.