గుంటూరు పారిశుద్ధ్య కార్మికులకు లక్ష రూపాయల విరాళం. 

గుంటూరు పారిశుద్ధ్య కార్మికులకు లక్ష రూపాయల విరాళం


   గుంటూరు, ఏప్రిల్ 16,(అంతిమ తీర్పు) :    బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ గుంటూరు నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళంను చెక్కు రూపంలో ఈ నెల 16వ తేదీన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అనురాధ ను కలసి 
మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి నేతృత్వంలో బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి పౌండేషన్ ప్రతినిధి పెండేల ప్రసాదు అందించారు. ఈ సందర్భంగా వల్లo రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలో ప్రతి ఆపద సమయంలో డాక్టర్ బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఆదుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల రూపాయలను, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు రెండు లక్షల రూపాయలను అందించారన్నారు. లాక్ డౌన్ ను  సక్రమంగా అమలు చేయటానికి గుంటూరు నగరంలో కమిషనర్ అనురాధ అవిరళ  కృషి చేస్తుందని అభినందించారు. గుంటూరు నగరంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకుయజమానులందరూ వేతనాలు చెల్లించాలని విన్నవించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరు వారికి తోడ్పాటునoదించాలని విజ్ఞప్తి చేశారు.