ఢీ న్యూస్ వీక్లీ పత్రిక సారథ్యంతో.....   గర్భిణీ,బాలింత స్త్రీలకు పండ్లు పంపిణీ     

ఢీ న్యూస్ వీక్లీ పత్రిక సారథ్యంతో.....             గర్భిణీ,బాలింత స్త్రీలకు పండ్లు పంపిణీ     


  కంచికచర్ల   ఏప్రిల్ 13:        ....అంగన్వాడి సెంటర్ల పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీలు,బాలింతలకు ఢీ న్యూస్ వీక్లీ పత్రిక సౌజన్యంతో పండ్లు పంపిణీ చేశారు. సోమవారం నాడు స్థానిక మోడల్ కాలనీ, ప్రణీత కాలనీలోని సెంటర్లో ఉన్న మహిళలకు బలవర్థక పోషకపదార్థాలను అందించాలనే ఉద్దేశంతో పలు రకాలైన పండ్లను వారికి అందజేశారు .ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు బుద్దా నీరజ , వేల్పుల చిన్న మహాలక్ష్మి మాట్లాడుతూ కరోనా ఇబ్బందుల నేపథ్యంలోస దాతల సహాయంతో మహిళలకు పండ్లు ఇవ్వటం అభినందనీయం అన్నారు. గౌతమ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అధినేత చిరుమామిళ్ల విజయలక్ష్మి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్  చట్టా  తపస్వి మాట్లాడుతూ మహమ్మారి కరోనాను తరిమికొట్టేందుకు అందరు ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు .సేవా తత్పరులు ముందుకు వచ్చి ఇబ్బందులు పడుతున్న కుటుంబాల వారికి సహాయ సహకారాలు అందజేయాలని కోరారు .మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని ఆర్థిక స్థితి కలిగినవారు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. మానవతాసాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ ఆయాలు యరమాల జ్యోతి , వి. జోజిరాణి తదితరులు పాల్గొన్నారు.