హెలికాప్టర్ మనీ లేదా  క్వాంటిటేటివ్ ఈజింగ్    పద్ధతులను పాటించండి 

హెలికాప్టర్ మనీ లేదా  క్వాంటిటేటివ్ ఈజింగ్    పద్ధతులను పాటించండి 


   హైదరాబాద్ :               తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో విడియో కాన్ఫరెన్స్ సందర్భంగా, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినందున, క్వాంటిటేటివ్ ఈజింగ్ - హెలికాప్టర్ మనీ పద్ధతులను అవలంబించి రిజర్వు బ్యాంకు ద్వారా నిధులు అందజేయాలని కోరారు. అసలు ఈ రెండు పద్ధతులు ఏమిటి? వీటిని ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.


క్వాంటిటేటివ్ ఈజింగ్.. ఇది ఒక ద్రవ్య విధానం. ఏదైనా దేశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చులు రాబడి కంటే విపరీతంగా పెరిగిపోయి, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారినప్పుడు, తన వద్ద ఉన్న బాండ్లను, ఇతర ఆర్థిక ఆస్తులను అమ్మి, ఆ లోటును పూడ్చుకోవడమే క్వాంటిటేటివ్ ఈజింగ్.
ఈ పద్ధతిలో ఆ బాండ్లను కొనవలసింది భారత రిజర్వ్ బ్యాంకు. వడ్డీ రేటుతో సంబంధం లేకుండా లభించే ఈ సంపదను రాష్ట్రం తన ఆర్థిక వ్యవస్థలోకి పంపి, ప్రజల కొనుగోలు శక్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక సంతులతను స్థిరీకరిస్తుంది. సాధారణంగా ఈ పద్ధతిని ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నప్పుడు వాడటం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతారు.


అదనంగా డబ్బు మార్కెట్లోకి రావడం వల్ల ద్రవ్యలభ్యత ఎక్కువవుతుంది. రుణాల లభ్యత చాలా సులభంగా ఉంటుంది. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని, కొనుగోలు శక్తిని పెంచుకుంటారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదురుకుంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లంటే, తన స్వంత ఆర్థిక ఆస్తులన్నమాట. వీటినే 'స్టేట్ డెవలప్‌మెంట్‌ లోన్స్' గా కూడా వ్యవహరిస్తారు. ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముందుగా ఒప్పుకున్న శాతాన్ని చెల్లిస్తూ, చివరికి అసలు మొత్తాన్ని చెల్లించడమే ఈ పద్ధతి. ఉదాహరణకు, ఒక రాష్ట్రం ఓ పది కోట్లకు బాండ్‌ను విడుదల చేస్తే, రిజర్వ్ బ్యాంకు దాన్ని 10శాతం వార్షిక చెల్లింపు నిబంధన కింద 10 సంవత్సరాలకు తీసుకుందని అనుకుందాం. అంటే, ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ఆ రాష్ట్రం చెల్లిస్తూ, పదేళ్లు నిండాక అసలు మొత్తం పది కోట్లు చెల్లించాల్సిఉంటుంది. ఇదే క్వాంటిటేటివ్ ఈజింగ్.


ఈ పద్ధతిని ముందుగా జాన్ మేనార్డ్ కేన్స్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడని అంటారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ ముందుగా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని అమెరికా, యూరప్‌లలో అవలంబిస్తున్నారు.


హెలీకాప్టర్ మనీ


హెలీకాప్టర్ మనీ అనేది క్వాంటిటేటివ్ ఈజింగ్‌తో పోలస్తే భిన్నమైనదీ, అరుదైనది కూడా. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయి, ప్రజల కొనుగోలు శక్తి శూన్యమయినప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కేంద్ర బ్యాంకు ప్రజలకు (వినియోగదారులకు) నేరుగా డబ్బు పంపిణీ చేస్తుంది. అంటే, మన బ్యాంకు అకౌంట్‌లో లక్షలకులక్షలు వచ్చి పడటం కాదు కానీ, ఇంచుమించు అలాంటిదే.

ప్రజల ఆదాయం, ఖర్చుల కంటే తగ్గిపోయినప్పుడు వారేది కొనడానికి ఆసక్తి చూపరు. అలా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఉత్పత్తుల ధరలు పడిపోతాయి. దీన్నే ప్రతిద్రవ్యోల్బణం లేదా డిఫ్లేషన్ అంటారు. దీన్ని నివారించాలంటే, ప్రజలకు అయాచితంగా డబ్బు అందాలి. దాంతో వారు మార్కెట్ల మీద పడి, విపరీతంగా కొనుగోలు చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు భారీగా ప్రవేశించి సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది. హెలీకాప్టర్ ద్వరా డబ్బు వెదజల్లితే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అందుకే ఈ ద్రవ్య విధానానికి ఈ పేరు పెట్టారు.


మరి అలా నేరుగా డబ్బును ప్రజలకే పంపాలంటే ఎలా? ఏదైనా తప్పనిసరి చెల్లింపును రద్దు చేయడం. ఉదాహరణకు మన ఆదాయపు పన్నును కొంత కాలం పాటు రద్దు చేయడం. ఇలా చేయడం వల్ల మన ప్రతీ ఏడాది చెల్లిస్తున్న పన్ను ఇక ఆపేయవచ్చు. దాంతో మనకు చాలా మొత్తం మిగులుతుంది. దాన్ని ఖర్చు చేయడం కోసం కొనుగోళ్లు చేస్తాం. అంతే..


1969లో అమెరికా ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్‌మన్ ఈ విధానాన్ని ప్రతిపాదించగా, 2002లో మరో ఆర్థికవేత్త బెన్ బెర్నాంకె దానికి మెరుగులు దిద్ది, ప్రాచర్యంలోకి తీసుకొచ్చారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image