విశాఖపట్నంలో ట్రయల్ ప్రాతిపదికన ఓలా క్యాబ్ లకు అనుమతి..

 


విజయవాడ తేదీ: 9.(అంతిమ తీర్పు) :


పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ట్రయల్ ప్రాతిపదికన ఓలా క్యాబ్ లకు అనుమతి..


ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర సమన్వయకర్త) 
 ఎమ్. టి. కృష్ణ బాబు 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసర వైద్య సదుపాయం  అవసరమయ్యే పౌరులకు రవాణా కోసం  ఓలా క్యాబ్ లకు  విశాఖపట్నం నగరంలో పైలట్ ప్రాజెక్ట్ గా అనుమతించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర సమన్వయకర్త) ఎమ్. టి. కృష్ణ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


 కోవిడ్ కాకుండా  డయాలసిస్, క్యాన్సర్, గుండె జబ్బులు  తదితర రోగులను  ఆసుపత్రులకు తీసుకుని వెళ్ళడానికి , తిరిగి ఇళ్లకు తీసుకుని వెళ్లాడానికి అనుమతించడం జరిగిందన్నారు. అలాగే విధుల్లో ఉన్న వైద్యులు,  ఆరోగ్య సిబ్బంది  విధులకు హాజరు కావడానికి ఈ సడలింపు ఇవ్వడం జరిగిందన్నారు.  పైలట్ గా విశాఖపట్నం లో అమలుకు అనుమతించడం జరిగిందన్నారు.


కర్ణాటక రాష్ట్రంలో ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సహకారంతో కర్ణాటక రాష్ట్రంలో ఇటువంటి అనుమతులు ఇవ్వడం జరుగుతున్నాయని, తమకు అవకాశం ఇవ్వాలని ఓలా సంస్థ కోరారన్నారు.   రవాణా, పోలీసు విభాగాలతో సంప్రదించి పై అభ్యర్థనను పరిశీలించి,  ఓలా క్యాబ్ వారి అభ్యర్థన మేరకు ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ట్రయల్  ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.   ఈ సౌకర్యం వైద్య అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఉపయోగించు కోవాలని తెలిపారు. 


  భౌతిక దూరాన్ని పాటిస్తూ,  ప్రమాణాలకు లోబడి డ్రైవర్‌ను మినహాయించి ప్రయాణికుల సంఖ్య ఇద్దరు మాత్రమే ఉండాలన్నారు. ఈ ప్రయాణ క్రమంలో వినియోగదారులు మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించాలన్నారు.  నియమాలను అతిక్రమించి  ప్రయాణలను తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు.  క్యాబ్ క్రమం తప్పకుండా డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్  చేయడం మరియు శుభ్రపరచడం చేయాలన్నారు. తద్వారా   OLA ప్రయాణీకుల భద్రతను ఖచ్చితంగా పాటించాలని ఆయన తెలియచేసారు.


--


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image