మానవతా మూర్తి అంగన్వాడీ ఆయా చెన్నమ్మ* 


నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం నాడు దివ్యభారతి కి కాన్పు చేయించిన  మానవతా మూర్తి అంగన్వాడీ ఆయా చెన్నమ్మ* -


*లాక్ డౌన్ లో పరిమళించిన మానవత్వం..అంగన్వాడీ ఆయానే.. అమ్మగా మారి..ఒక నిండు గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లి కాన్పు చేయించినందుకు కలెక్టర్ వీరపాండియన్.. చలించి పోయి రూ. 20,000 ల క్యాష్ అవార్డు ప్రకటన* 


కర్నూలు, ఏప్రిల్ 11: కంటికి కనిపించని.. కర్కశ  కరోనా ..ఒక వైపు మనుషుల ఆరోగ్యాన్ని మసి చేస్తూనే.. మరో వైపు మనుషుల్లో మానవత్వాన్ని...తోటివారికి సాయం చేసే గుణాన్ని పెంచింది..ఇందుకు ఉదాహరణ.. జిల్లాలో ఒక అంగన్వాడీ ఆయానే.. అమ్మగా మారి.. లాక్ డౌన్ లో భయపడుతున్న ఒక నిండు గర్భిణీకి..అమ్మ రాలేక పోయినా ..అమ్మలా  నేనున్నాను..అంటూ ధైర్యం చెప్పి తనే స్వయంగా గర్భిణీని  ఆటోలో  ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ..రెండు రోజులుగా దగ్గర ఉండి..ప్రభుత్వం డాక్టర్లతో కాన్పు చేయించగా ..ఆ గర్భిణీ కి పండంటి బాబు పుట్టడంతో ..ఆస్పత్రిలో..అందరూ ..అంగన్వాడీ ఆయమ్మను ..పొగడగా...ఈ మానవీయ సంఘటన ను ఐసిడిఎస్ పిడి ద్వారా శనివారం రాత్రి 10:30 గంటలకు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్.. అంగన్వాడీ ఆయమ్మ సహాయ స్పూర్తిని మెచ్చుకుంటూ..రూ.20,000 ల నగదు అవార్డును, ప్రశంసా పత్రాన్ని మీడియా ప్రకటన ద్వారా ప్రకటించారు.


వివరాలలోకెళితే ..కర్నూలు నగరంతో పాటు అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నంద్యాలలో ఒక వైపు కరోనా కేసులు..మరో వైపు లాక్ డౌన్ పటిష్ట0గా అమలు.. ఈ తరుణంలో సాయనికి పిలిచినా సందేహించే..పరిస్థితిలో షరాఫ్ బజార్ సుంకులమ్మ వీధిలో ఉన్న దివ్యభారతి అనే నిండు గర్భిణీ కి శుక్రవారం నాడు పురిటి నొప్పులు రాగా.. లాక్ డౌన్ వల్ల కర్నూలు లో ఉన్న తన తల్లి రాలేకపోవడంతో ..దిక్కుతోచని స్థితిలో ..తాను ఆరోగ్య పరీక్షల కోసం అప్పుడపుడూ.. వెళ్లే సుంకులమ్మ వీధి అర్బన్ అంగన్వాడీ కేంద్రం ఆయా చెన్నమ్మ గుర్తొచ్చి..సాయం చేయాలని అడిగిన తక్షణమే.. కరోనా..నై.. లాక్ డౌన్ నై.. సాయనికి సై అంటూ మానవత్వం తో వెంటనే స్పందించి.. తనకు తెలిసిన ఒక ఆటోలో నిండు గర్భిణీ దివ్యభారతి ని ఎక్కించుకుని.. అమ్మలా నేనున్నాను అంటూ ..ఆయమ్మ  సరాసరి..నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్ళి, డాక్టర్లతో పరీక్షలు చేయించి..శుక్రవారం నుండి తనతో పాటు ఆస్పత్రిలో నే ఉండి శనివారం ఉదయం 11:30 గంటలకు దగ్గర ఉండి ..ప్రభుత్వ డాక్టర్ తో కాన్పు చేయించగా ..దివ్యభారతి..4 కేజీల బరువున్న  పండంటి బాబు కు జన్మనివ్వగా ...తనకు పునర్జన్మ ఇచ్చిన అంగన్వాడీ ఆయా చెన్నమ్మ కు ఆనంద భాష్పాలతో..కృతజ్ఞత తెలుపగా..డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా చెన్నమ్మ మానవతను పొగడగా...ఈ విషయాన్ని శనివారం రాత్రి 10:30  గంటలకు ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అంగన్వాడీ ఆయా చెన్నమ్మ మానవీయ.. మంచి మనసు జిల్లా ప్రజలందరిలో స్పూర్తిని నింపాలని తక్షణమే రూ.20,000 ల నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని మీడియా ప్రకటన ద్వారా ప్రకటించి..అంగన్వాడీ ఆయా చెన్నమ్మ ను కలెక్టర్ అభినందించారు. దివ్యభారతి కాన్పు అయిన తరువాత కూడా శనివారం రాత్రి కూడా  ఆయా చెన్నమ్మ  నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నే ఉండి తన భార్యను అమ్మలా చూసుకుంటూ ఉన్న ఆయమ్మ చెన్నమ్మ ను బంగారు పని చేసుకునే రోజూ కూలీ దివ్యభారతి భర్త హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు