కొండాయపాలెం పంచాయతీలో కూరగాయల పంపిణీ*

*కొండాయపాలెం పంచాయతీలో కూరగాయల పంపిణీ*
 ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ మాజీ సర్పంచ్ గానుగపెంట cn ఓబులరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని ఐదు గ్రామాలకు మంగళవారం ఉచితంగా కూరగాయల పంపిణీ చేపట్టారు. పనులు లేక బయటకు వెళ్లే పరిస్థితి ప్రజలకు లేదని అందు వల్ల పంచాయితీ లోని అన్ని గ్రామాల ప్రజలకు కూరగాయలు అందించినట్టు ఆయన తెలిపారు.  లాక్ డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొనసాగితే పంచాయితీ లోని పేద ప్రజలకు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు ప్రజల సామాజిక దూరం పాటించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి లాక్ డవున్  కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.మొత్తం 1130 కుటుంబాలకు 3కేజీ లు చొప్పున కూరగాయలు అందించారు.  ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎస్సై జ్యోతి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు