*జేవీవీ చేస్తున్న సేవలు అమోఘం
కరోనా అనే వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్న జనవిజ్ఞానవేదిక సేవలు అభినందనీయం అని వరికుంటపాడు తహసీల్దార్ చేవూరి శ్రీనివాసులు కొనియాడారు. వరికుంటపాడు మండల జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మంగళవారం జి కొండారెడ్డిపల్లి లో నిరుపేద లు అయిన 120 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి బస్తా చెప్పున 120 బస్తా లు బియ్యం పంపిణి చేసారు, ఈ సందర్భంగా జనవిజ్ఞానవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమిత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రస్తుత పరిస్థితులు లో ప్రభుత్వం అమలు చేస్తున్న సూచనలు సలహాలు పాటించాలని అన్నారు. అనంతరం నాలుగు వందల మాస్క్ లను పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సురేష్ కుమార్, ఎస్ఐ ఉమా శంకర్, ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ గుంటుపల్లి ఆంజనేయులు మండల వైసీపీ కన్వీనర్ మందలపు తిరుపతినాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బోగినేని శ్రీనివాసులు, జేవీవీ సీనియర్ నాయకులు వెంకట సుబ్బయ్య, జేవీవీ ఉపాధ్యక్షులు డీవీ రమణయ్య, జేవీవీ నాయకులు నాదెండ్ల రమణయ్య, మాల్యచలం పంచాయతీ కార్యదర్శి శివ కుమార్, వాలంటీర్స్ పాల్గొన్నారు
జేవీవీ చేస్తున్న సేవలు అమోఘం