ఎదురుదాడి చేయడం సరికాదు- కేఎస్ జవహర్

తేదీః 06-04-20
కేఎస్ జవహర్ విలేకరుల సమావేశం వివరాలు
ప్రతిపక్ష నేత సూచనలు తీసుకోకుండా ఎదురుదాడి చేయడం సరికాదు- కేఎస్ జవహర్
         రాష్ట్రాన్ని ఏలినాటి శని వెన్నాడుతోందని మాజీ మంత్రివర్యులు కేఎస్ జవహర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల జరిగినప్పటి నుంచి రాష్ట్రాన్ని సంక్షోభాలు, అనుభవరాహిత్యం, అవగాహనలేమి వెన్నాడుతోంది. కరోనా పెద్ద విషయమేమీ కాదని జగన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు. కరోనా ఎక్కడ పుట్టిందో కూడా తెలియదు. దీనిని బట్టి పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. పారాసెట్మాల్, బ్లీచింగ్ అంటూ బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి కరోనా గురించి చులకనా, అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. కొడాలి నాని, పేర్నినాని ఏవిధంగా మాట్లాడారో మనం చూశాం. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు గారు సూచనలు చేయడం ఏవిధంగా తప్పు. ప్రభుత్వ చేపట్టిన చర్యలను బహిర్గతం చేయాలని కోరడం తప్పా. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో ఎంతమందికి పరీక్షలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను పొగిడిన వారు నేడు 266కు కేసులు ఏవిధంగా పెరిగాయి. పేర్ని నానికి జ్ఞానం ఉంటే కదా ఇంగితజ్ఞానం గురించి మాట్లాడటానికి. జగన్ మంత్రివర్గంలో ఉన్న పేర్నినాని, ఆళ్లనాని, కొడాలి నాని బ్యాచ్ లతో రాష్ట్రాన్నిఅధోగతి పాలు చేస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు గారు సూచనలు చేస్తున్నారు. రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని కరోనా బారి నుంచి తప్పించేందుకు తన వంతు బాధ్యత నెరవేరుస్తున్నారు. పేర్నినాని దుగ్ధతోనే విమర్శలు చేస్తున్నారు. మరో రెండేళ్లు మంత్రి గా కొనసాగవచ్చనే దుగ్ధతోనే చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు. చంద్రబాబు జ్ఞానాన్ని చూసి భయపడుతున్నారు. హైదరాబాద్ కు చంద్రబాబు గారు ఎప్పుడు వెళ్లారో, లాక్ డౌన్ ఎప్పుడు విధించారో విజయసాయిరెడ్డి గమనించాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రావాలా. చేతనైతే చంద్రబాబు గారు చెప్పే విషయాలు మీరు పరిగణనలోకి తీసుకోవాలి. వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు ఎలా పొందాలో ఆలోచన తప్ప.. జగన్ ఏమాత్రం వినిపించుకోవడం లేదు. మూర్ఖపు వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. వెయ్యి రూపాయలు ఏమాత్రం సరిపోవు. కనీసం రూ.5వేలు ఇవ్వాలి. ప్రభుత్వంపై ప్రజలు  విశ్వాసం కోల్పోయారు. నడిరోడ్డుపై ప్రజలను ఉంచారు. జగన్ మాత్రం ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాల్లో కోత విధించారు. వచ్చే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితిలు వస్తాయి. అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారు. నేరుగా మీడియాతో కూడా మాట్లాడే ధైర్యం లేదు. కట్ అండ్ పేస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర దేశంలో జగన్ ది మాత్రమే. చంద్రబాబునాయుడు గారిని తిట్టడం మాని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. ఆక్వా రంగం, పౌల్ట్రీ రంగాలు దెబ్బతిన్నాయి. అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. తెల్లకార్డు లేనివారు ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి అవసరం. ప్రతిపక్షాల సేవలను వినియోగించుకోవాలి. పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్లనాని చంద్రబాబు గారి పేరును నిత్యం స్మరించడం మానుకోవాలి.