ముందస్తు జాగ్రత్త చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు


గుంటూరు, ఏప్రిల్ 27-2020:- నరసరావుపేటలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. 


     సోమవారం నరసరావుపేటలోని మునిసిపల్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, కోవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు డా. కమల్ రాజ్, గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విజయారావులతో కలసి కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్, పోలీసు, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజారోగ్యం భద్రత, ప్రజా సంరక్షణ కోసం కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.  డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు ప్రకారం క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు అనువుగా వున్న భవనాలు, హోటల్స్ ను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు.  కంటైన్మేంట్ క్లస్టర్ కు రాకపోకల కోసం ఒక మార్గాన్నే ఏర్పాటు చేయాలని, మిగతా మార్గాలన్ని  మూసి వేసి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.  నిత్యావసర సరుకుల కొనుగోలుకు మినహాయించిన సమయం, మెడికల్  ఎమర్జెన్సీ తప్ప ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపి వేయాలన్నారు. రెడ్ జోన్ లో వున్న వారికి ఇంటి ముందుకే నిత్యావసర సరుకులు పంపిణి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంటైన్మేంట్ క్లస్టర్  వద్ద ఏర్పాటు చేసిన కంట్రోలు రూము వద్ద హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి, ఆ నంబరును ఆ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.   కంటైన్మేంట్ క్లస్టర్, రెడ్ జోన్ల వారు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి అవసరమైన మందులను తెప్పించుకునే వీలు కల్పించాలన్నారు.  అత్యవసర సేవలలో పాల్గొనే వారికి కోవిడ్ పాసులు అందించాలన్నారు.  బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కట్టడి విధులలో పని చేస్తున్న ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు సైతం గ్లౌజులు, మాస్కులు ధరించి సురక్షిత పద్దతులు పాటించి విధులు నిర్వహించాలన్నారు.   రెడ్ జోన్లలో సర్వేలెన్స్ టీము నిర్వహిస్తున్న సర్వే వివరాలను ఎప్పటికప్పుడు అధికారులను అందించాలన్నారు. కంటైన్మేంట్ క్లస్టర్లలో మృతి చెందిన వ్యక్తుల శాంపిల్స్ తప్పని సరిగా పరీక్షించాల్సి ఉందన్నారు. ఆ మేరకు పాజిటివ్ కేసుగా తేలితే ప్రైమరీ, సెకండరీ కంటాక్స్ ను గుర్తించాల్సి వుందన్నారు. నరసరావుపేటలోని కంటైన్మేంట్ క్లస్టర్లను పర్యవేక్షించేందుకు తప్పని సరిగా కమాండ్ కంట్రోలు రూమును ఏర్పాటు చేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు సబ్  కలెక్టర్ ఆధ్వర్యంలో 22 టీములను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రతి టీములో నలుగురు అధికారులుంటారన్నారు.  జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకిత భావంతో  పని చేయాలన్నారు.  


     


     కోవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ జారీ చేస్తున్న ఆదేశాలను తూ.చా తప్పకుండా క్షేత్ర స్థాయిలో అమలు పరచి వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు తప్పని సరిగా  ధరించడం, శానిటేషన్ పక్కాగా అమలు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టండంలో కృషి చేయాలన్నారు. 


     రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు డా. కమల్ రాజ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ విపత్కర పరిస్థితులలో ఉద్యోగులందరూ బాధ్యతగా సమన్వయంతో పని చేసి కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టాలన్నారు. 
 
    గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విజయారావు మాట్లాడుతూ, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వుండి  లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలన్నారు. అనవసరంగా రహదారుల మీదకు వచ్చే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.


     సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎ. ఎస్.దినేష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్,  ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి, నరసరావుపేట రెవిన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు, మునిసిపల్, రెవిన్యూ, పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
గుంుు