*09–04–2020*
*అమరావతి*
*అమరావతి : కోవిడ్ నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*హాజరైన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, వ్యవసాయశాఖమంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి*
*సమీక్షా సమావేశానికి ముందు దేశంలో కోవిడ్ విస్తరణ, నమోదవుతున్న కేసులు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, వివిధ అధ్యయనాలపై సీఎంకు వివరాలు అందించిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి*
తర్వాత రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యలపై వివరాలు అందించిన అధికారులు
ఉదయం 9 గంటలవరకూ గడచిన 12 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్న అధికారులు
ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీకాంటాక్టులు వల్లే కేసుల సంఖ్య పెరగడానికి కారణాలని వివరించిన అధికారులు
వీరి పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ... వాటి కేసుల సంఖ్య తగ్గుతుందన్న అధికారులు
ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టు అయిన వారి వివరాల సేకరణలో రాష్ట్ర పోలీసు విభాగం పనితీరుపై ప్రశంసలు కురిపించిన అధికారులు
డీజీపీ నేతృత్వంలో సిబ్బంది అద్భుతంగా పనిచేసి ఢిల్లీ వెళ్లినవారివే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకున్నట్టయిందని తెలిపిన అధికారులు
జమాతేకు వెళ్లినవారు, వారి కాంటాక్టులను సేకరించి వారి ఆరోగ్య రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషించారని కితాబు
*కుటుంబ సర్వే సమగ్రంగా జరగాలి:*
– ఇప్పటికే జరిగిన మొదటి, రెండు రాష్ట్రంలోని కుటుంబాల వారీ సర్వేపై సీఎం ఆరా
– మూడోసారి జరుగుతున్న సర్వేపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
– భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం మరో రెండు కేటగిరీలను చేర్చి, అదనపు ప్రశ్నలను సర్వేలో జోడించామన్న అధికారులు
– కుటుంబ సర్వే సమగ్రంగా జరగాలని అ«ధికారులను ఆదేశించిన సీఎం
– ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై సర్వేచేసి వివరాలు నమోదుచేయాలన్న సీఎం.
– రియల్‌టైం పద్ధతిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదుచేస్తున్నామన్న అధికారులు
– మొదటి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో గుర్తించినట్టుగా పేర్కొన్న 6,289 మందికూడా ఈసర్వేలో భాగంగా ఉండాలని స్పష్టంచేసిన సీఎం
– మెడికల్ ఆఫీసర్ నిర్ధారించిన వారినే కాకుండా ... వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు చేయించాలన్న సీఎం
– ఎక్కడా కూడా తప్పులకు జరగడానికి అవకాశాలు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలన్న సీఎం.
– *ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్ వార్డు ఏర్పాటుపై సీఎం ఆరా*
– దీనిపై నిశితంగా సమీక్ష చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
– ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశం
– క్వారంటైన్లలో సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని, నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలను ఏర్పాట చేస్తున్నామని సీఎంకు వివరించిన అధికారులు.
*వ్యవసాయం, పరిస్థితులపై సీఎం సమీక్ష:*
– వ్యవసాయంపై కోవిడ్ –19 ప్రభావం, రైతులకు అండగా తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష
– ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై వివరాలు అందించిన అధికారులు, వారంరోజుల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు పంటరావడం పెరుగుతుందని తెలిపిన అధికారులు.
– *కోవిడ్–19 విపత్తు నేపథ్యంలో రవాణా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ.*
– ధాన్యం రవాణాకు ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, ఆమేరకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్న సీఎం
– రవాణాలోకూడా నిల్వచేయలేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న అధికారులు.
– మిర్చి మార్కెట్‌యార్డులను రెడ్‌జోన్, హాట్‌స్పాట్లకు దూరంగా వికేంద్రీకరణ చేస్తున్నట్టుగా తెలిపిన అధికారులు
– ఉత్పత్తి ఉన్నచోటే మార్కెట్‌యార్డులను పెట్టేదిశగా ఆలోచన చేస్తున్న అధికారులు
– రైతులు బయట మార్కెట్లో తమ పంటలను అమ్ముకోవాలని అనుకుంటే వారికి పూర్తిగా సహకరించేలా రవాణా సౌకర్యాలు అందించాలన్న సీఎం
– వీరికి మార్కెటింగ్ పరంగానూ అధికారులు సహాయ సహకారాలు అందించాలన్న సీఎం.
– రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీసుకునే చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ జరగాలన్న ఉద్దేశం నెరవేరాలన్న సీఎం.
– రైతులను ఆదుకునే చర్యల విషయంలో అధికారులు దూకుడుగానే ఉండాలన్న సీఎం
– రాష్ట్రంలో పండే పండ్లను స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామన్న అధికారులు.
– స్వయం సహాయక సంఘాల ద్వారా ఇప్పటికే అరటిపళ్ల విక్రయాన్ని ప్రారంభించామని, క్రమంగా చీనీ లాంటి పంటనూ స్థానికంగా గ్రామాల్లో అందుబాటులోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తామన్న అధికారులు.