బటన్‌ నొక్కి ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద డబ్బును పంపిన సీఎం 

*24–04–2020*
*అమరావతి*


అమరావతి: విపత్తు సమయంలో మహిళలకు కొండంత అండగా రాష్ట్ర ప్రభుత్వం.మహిళా సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లు విడుదల.క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద డబ్బును పంపిన సీఎం  వైయస్‌.జగన్‌.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న స్వయంసహాయక సంఘాల మహిళలు, కలెక్టర్లు.2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయింది:


మొట్టమొదటిగా నాన్నగారు పావలా వడ్డీకే రుణాలు అని తీసుకు వచ్చారు:రూపాయి పైచిలుకు ఉన్న రుణాలను పావలా వడ్డీకే నాన్నగారు తీసుకు వస్తే.. ఆ పథకం తర్వాత సున్నా వడ్డీగా మారింది:2016లో పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు:మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నాం:అక్కచెల్లెమ్మలు అందరికీ రూ.1400 కోట్లు ఈ పధకం కింద ఇవ్వగలగులుతున్నాం:ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు:కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, రావాల్సిన ఆదాయం రాని పరిస్థితులు ఉన్నా.. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్కచెల్లెమ్మలకు ఈ పథకం తీసుకురావడం వల్ల కాస్తో కూస్తో మేలు జరుగుతుందని అనుకుంటున్నాం:8లక్షల 78వేల గ్రూపులకు ఈ పథకం ద్వారా 91లక్షలమంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది:ప్రతి గ్రూపునకు కనీసం రూ.20వేల నుంచి రూ.40వేల వరకూ ఈపథకం వల్ల మేలు జరుగుతుంది:ప్రతి ఏటా ఈ కార్యక్రమం ద్వారా ఆమేరకు లబ్ధి పొందుతారు:కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3లక్షల పరిమితి వరకూ ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నారు:మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారు:సున్నా వడ్డీ అమలు చేయాలంటే 7శాతం నుంచి 13 శాతం వరకూ ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి:ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి గ్రూపునకూ 7శాతం వడ్డీ నుంచి 13.5శాతం వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి:సగటున ప్రతి గ్రూపునకురూ.20 వేల నుంచి రూ.40వేల వరకూ లబ్ధి చేకూరుతుంది:దీనివల్ల పొదుపు సంఘాలకు మరింత మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం:మనం చేసే ప్రతి పథకంలోకూడా అక్కచెల్లెమ్మలకే పెద్దపీటే వేశాం:మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు:


ముగ్గురు మహిళా మంత్రులు ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్నారు:డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు, సీఎస్‌ స్థానాల్లో మహిళలు ఉన్నారు:వారి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు :తల్లుల చేతిలో అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే పూర్తిగా సద్వినియోగం అవుతుందని నా భావన:ఫలితాలు బాగుండాలి, ప్రతి పైసా సద్వినియోగం అవుతుందని భావిస్తున్నాం:82 లక్షలమంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మ ఒడి పథకం:పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు – నేడు కింద స్కూళ్లలో కార్యక్రమాలు:కరోనా లేకపోతే.. అక్షరాల 27 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌ అయ్యేవి:అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాన్నగారి పుట్టినరోజున జులై 8న ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం:జులై 8న ఈ 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం:ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాదు, ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం:నామినేటెడ్‌ పనులు, నామినేటెడ్‌ పదవులు 50శాతం అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలని గొప్ప చట్టం తీసుకు వచ్చాం:వక్ర బుద్ధితో అక్క చెల్లెమ్మల వైపు చూస్తే.. కఠినంగా శిక్షలు వేసేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం:త్వరలో రాష్ట్రపతిగారు దీనికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం:13 దిశ పోలీస్‌స్టేషన్లను, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకు వచ్చాం:ప్రత్యేక యాప్‌కూడా కూడా తీసుకు వచ్చాం:ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక మహిళా పోలీసును పెట్టాం:11వేలకుపైగా మహిళా పోలీసులను రిక్రూట్‌ చేసి ఉద్యోగాలు ఇవ్వగలిగాం:గ్రామ సచివాలయాల్లో 7–8 మంది మహిళా మిత్రలను ఏర్పాట చేయడం జరిగింది:బెల్టుషాపులు ఉన్నా, గృహహింస జరిగినా.. వెంటనే తగిన చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది:వసతి దీవెన అని ఈ మధ్య కాలంలో 12 లక్షలమందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం:డిగ్రీ, ఇంజినీరింగ్‌ లాంటి చదువులు చదివేవారికి రెండు దఫాల్లో వసతి దీవెన కింద తల్లుల అక్కౌంట్లో వేయగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం:ఎప్పుడూ కనివినీ ఎరుగని విధంగా గత ప్రభుత్వం పెట్టిన మొత్తం ఫీజు రియంబర్స్‌మెంట్‌.. ఇవ్వడమే కాకుండా, ఈ మంగళవారం నాడు మార్చి 31 వరకూ ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లిస్తాం:వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతిమూడు నెలలకు సంబంధించి పీజు రియింబర్స్‌మెంట్‌ను నేరుగా తల్లుల అక్కౌంట్లోకి వేస్తాం:తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? కాలేజీల్లో మౌలికసదుపాయాలు ఎలా ఉన్నాయి అని తల్లులు చూసుకుని ఆ ఫీజులు చెల్లిస్తారు:జవాబుదారీ తనంకోసమే ఇలా చేస్తున్నాం:రాబోయే కాలంలో ఇంకా మంచి పనులు చేయడానికి దేవుడి దీవెనలు ఉండాలని కోరుతున్నాను అని అన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..