క్షురకుల జీవితాలు క్షవరం  

క్షురకుల జీవితాలు క్షవరం                    
 


అంతిమ తీర్పు,ఏప్రిల్ 20, శ్రీకాళహస్తి.                                                                                       వేదం .... నాదం అంటారు పెద్దలు. సర్వలోకాలను పాలించి, మేల్కొపే భగవంతుడిని సైతం వేదమంత్రాలతో బ్రాహ్మణులు, మంగళ నాద వాయిద్యాలతో నాయీ బ్రాహ్మణులు మేల్కొపుతారు. నాయీ బ్రాహ్మణులను వ్యవహారికంగా మంగళ్ళుగా పిలుస్తుంటారు. మంగళ్ళు అంటే మంగళకరులు, శుభకరులు అని అర్థం. అలాంటి నాయీ బ్రాహ్మణుల జీవితాలు  కోవిద్-19 @ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మంగళకరమైన రోజులు కనుమరుగయ్యాయనే చెప్పాలి. నాయీ బ్రాహ్మణుల ప్రధాన వృత్తి క్షవరం చేయడం, మంగళ వాయిద్యాలు మ్రోగించడం. ప్రాచీనకాలం నుండి నాయీ బ్రాహ్మణులు సామాజిక వైద్యులుగా కూడా పేరుగాంచారు. అలాంటి నాయీ బ్రాహ్మణులు వృత్తిలో భాగంగా తల వెంట్రుకలు కత్తిరించడం, తైల మర్దనం చేయడం వలన వ్యక్తులకు అత్యంత సమీపంలో పనిచేస్తుంటారు. అందువలన కరోనా వాహకులుగా మారే ప్రమాదం ఉందని క్షౌరశాలలకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇవ్వలేదు. క్షౌరశాలలు మూతపడిన నేపధ్యంలో పనిలేక వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. క్షౌర వృత్తిదారులు అందరూ దాదాపు దారిద్ర్యరేఖ దిగువకు చెందినవారే. క్షౌరశాలల అద్దెలు, ఉపకరణాల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో ఋణాలు తీసుకుని నిర్వహిస్తుంటారు. అనేక  సందర్భాలలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల వద్ద రోజువారీ సర్దుబాటు ఋణాలు కూడా అధిక వడ్డీలకు తీసుకుని కుటుంబ అవసరాలు తీర్చుకొంటుంటారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చేసిన అప్పులు తీర్చలేక, రోజువారీ కుటుంబ అవసరాలు తీర్చలేక నానావస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాయీ బ్రాహ్మణుల కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షౌరశాలలు తెరిచే వరకు నెలకు పదివేల రూపాయలు వంతున ప్రభుత్వం  తాత్కాలిక భృతి అందించాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్  కోరారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..