రేపు రామయ్య క‌ల్యాణం

                   ఒంటిమిట్ట, 2020, ఏప్రిల్ 06


రేపు రామయ్య క‌ల్యాణం


ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం


 టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఏప్రిల్ 7న మంగళవారం శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగనుంది. ఆలయ ప్రాంగ‌ణంలోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వ‌హిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భ‌క్తులు రాముల‌వారి క‌ల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.భక్తులు తమ ఇండ్ల నుంచే స్వామి వారి కల్యాణాన్ని వీక్షించవలసినదిగా మనవి.