కృష్ణా  జిల్లాలో  ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకం ప్రారంభం

కృష్ణా  జిల్లాలో  ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకం ప్రారంభంవిజయవాడ: స్వయం సహాయ బృందాలకు ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య( నాని),వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 8.23 లక్షలకు పైగా మహిళల ఖాతాల్లోకి రూ.69.33 కోట్లు జమ అవుతాయి.సెర్ప్ పరిధిలో 52,498 సంఘాలకు చెందిన( 6.32 లక్షల మంది ) పొదుపు ఖాతాలకు రూ.40.94 కోట్లు, మెప్మా పరిధి ప్రాంతాల్లోని 17,755 పొదుపు ఖాతాలకు ( 1.90 లక్షల మంది) రూ.28.39 కోట్లు ఒకేసారి వడ్డీ సొమ్మును ప్రభుత్వం జమ చేసింది.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, కలెక్టర్ ఏ. యండి.ఇంతియాజ్, డిఆర్డి ఎ పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి ఎన్. ప్రకాశరావు ,జిల్లా సమాఖ్య, మెప్మా సంఘాల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.