సున్నా వడ్డీ  పేరుతో వైసీపీ డ్వాక్రా మహిళలను మోసం చేస్తోంది : వంగలపూడి అనిత

23.04.2020
ర్రాాా
సున్నా వడ్డీ  పేరుతో వైసీపీ డ్వాక్రా మహిళలను మోసం చేస్తోంది 
వైసీపీ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుంది
                                                                          -వంగలపూడి అనిత
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మహిళల ఉసురు తప్పకుండా తగులుతుంది. వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తే మాటలు కోటలు దాటుతున్నాయ్, చేతలు ఇంటి గుమ్మం కూడా దాటట్లేదు. నవరత్రాలు పేరుతో మోసం చేసి వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టుండి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి మహిళలు గుర్తొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి డ్వాక్రా మహిళల రూ. 2,500  కోట్ల రూపాయలు రుణాలకు సంబంధించిన వడ్డీని రీయింబర్స్ మెంట్ చేయాల్సి ఉంది.  గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందనడం సరికాదు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఇది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వ డ్వాక్రా బకాయులు ఉంటాయి. అలాగే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడంతో పాటు ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ. 75 వేలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. డ్వాక్రా మహిళలను ఆదుకుంటామని  పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి రకరకాల విన్యాసాలు చేశారు. మహిళల నుదిటిపై ముద్దులు పెట్టి ప్రగల్భాలు పలికారు. సినిమా చూపించారు మహిళలకు. డ్వాక్రాలో ఒక మహిళ ఉండటమంటే ఆర్థిక భరోసా. కుటుంబానికి ఆసరా. మాయమాటలతో వారితో ఓట్లేంచుకుని కనీసం మొదటి విడత రుణమాఫీ గురించి కూడా నేటికీ మాట్లాడకపోవడం ఎంతవరకు న్యాయం? 45 సంవత్సరాలు దాటిన మహిళకు పెన్షన్ ఇస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది?  టీడీపీ హయాంలో ఐదు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి సున్నా వడ్డీ ఇచ్చాం. ఆ వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించింది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఏడు లక్షల యాభైవేలు కటాఫ్ పెడతానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి కేవలం మూడు లక్షల వరకు రుణం తీసుకున్నవారికి మాత్రమే వడ్డీ చెల్లిస్తామంటున్నారు. వైసీపీ మోసాన్ని మహిళలు అర్ధం చేసుకోవాలి.  లాక్ డౌన్ సమయంలో కూలి పనులకు వెళ్లలేక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాయిదాలేమీ చెల్లింకర్లేదన్నారు. కానీ వడ్డీలన్నీ మీరే చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారు. దయచేసి డ్వాక్రా మహిళలకు ఆ మూడు నెలల వడ్డీ కూడా రాయితీ ఇవ్వాలి. ఆర్వోలకు సంవత్సరం నుంచి జీతాలు లేవు. విఏవోలకు జీతాలు లేవు. పది వేల రూపాయల జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి ఓటేంచుకున్నారు. ఇదేనా మాట తప్పడు మడమ తిప్పడు అంటే ? దళిత మహిళలను కూడా ఆదుకోవాలి. కనీసం మొదటి విడత డబ్బులైనా ఇవ్వండి. పనికి రాని స్కీములు పెట్టి ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోంది. ఇంత జరుగుతుంటే ఈ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు? మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీ నోర్లేమైనాయి? కరోనాతో జనం బిక్కుబిక్కుమంటుంటే ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకోవడం ఏంటి? అసలావిడకు ఆ ఆలోచన ఎలా వచ్చిందో? పైగా పూలు చల్లించుకోవడమేంటని ప్రశ్నించిన వారిని రోజా ఇష్టమొచ్చినట్టు తిట్టడమేంటి? ఇదో పనికిమాలిన ప్రభుత్వం. మహిళలను మోసం చేసిన వారు ఎవరూబతికి బట్టకట్టలేదు. 
-SD
వంగలపూడి అనిత
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image