బాబు జగ్జీవన్ రామ్ జయంతి

*గుంటూరు:,ఏప్రిల్ 5,(అంతిమ తీర్పు) :


బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత  మేకతోటి దయాసాగర్ . బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5 న బీహార్ లోని ఓ దళిత కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసారని గుర్తుచేశారు. బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు ప్రజల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. పేద, బడుగు వర్గాల ప్రజల్లో బాబుజిగా స్థిరస్థాయిగా నిలిచిపోయారని హోంమంత్రి మేకతోటి సుచరిత  పేర్కొన్నారు. దళితుల పాలిట దైవంగా..మార్గానిర్దేశకులిగా బాబుజి నేటికీ కీర్తించబడుతున్నారని తెలిపారు. దేశ సేవకే అంకితమైన బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఎంతో మందికి ఆదర్శమని హోంమంత్రి  భర్త మేకతోటి దయాసాగర్ గారు పేర్కొన్నారు.