విజయసాయిరెడ్డి పై కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఫైర్ 

" విజయసాయిరెడ్డి పై కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఫైర్ 


విజయవాడ ,ఏప్రిల్ 22 (అంతిమ తీర్పు) :
"మీ అమ్మ మొగుడు వచ్చినా రాజధానిని ఇంచి కూడా కదిలించలేరు... అమరావతే అంధ్రప్రదేశ్ కు రాజధాని "


A1 , A2 ముద్దాయిలుగా , ఎఫ్హుడు జైలు కి వెళ్తారో తెలియని మీరు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని నిర్ణయిస్తారా ??


జగన్ రెడ్డి కి, విజయసాయిరెడ్డి కి దమ్ము ఉంటే 2019 ఎన్నికల మేనిఫెస్టో లో రాజధానిని మారుస్తాము అని ఎందుకు పెట్టలేదు ?


ఇప్పటికి అయినా మించిపోయింది లేదు ... రాజీనామాలు చేసి , 3 రాజధానుల ప్రకటనతో ఎలక్షన్స్ కి వెళ్ళండి... అప్పుడు మీ పరిస్థితి ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారు. 


విజయసాయిరెడ్డి! తప్పుడు లెక్కలు వ్రాసి, లక్ష కోట్లు దోచుకోవటం అనుకుంటున్నావా... ప్రజలు తలచుకుంటే మీ తల రాతలు మారుస్తారు! అది గుర్తుపెట్టుకో... 


ఖబడ్దార్... ప్రజల మనోభావాలతో ఆడుకోవొద్దు!


ప్రియతమ నేత స్వర్గీయ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి అభిమానిగా చెప్తున్నాను... జగన్ రెడ్డి గారు మీరు ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలవాలి అనుకుంటే, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాసంక్షేమం కోసం కృషి చేసి చూపండి.


విజయసాయిరెడ్డి లాంటి  దొంగలు, రాజకీయ అజ్ఞానులు ఇచ్చే తప్పుడు సలహాలు వింటే.. రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది!


శకుని మామ లాంటి విజయసాయిరెడ్డితో రోజు రోజుకు ప్రజలకు దూరం కావడం తప్ప జగన్‌కు ఒరిగేదేమి లేదు. 


శవాల మీద పేలాలు ఏరుకునే బుద్దితో.. రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుని ఉంటే.. టెస్టింగ్‌ కిట్లలో కూడా డబ్బులు దొబ్బేసి.. దాన్ని పక్కదారి పట్టించడానికి మరోసారి రాజధాని మార్పు అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు... ఖబడ్దార్‌!


వెంకటేశ్వరస్వామిని కొలుస్తా అని గొప్పలు చెప్పుకుంటున్న సాయిరెడ్డి... అదే స్వామి వారికి అమరావతిలో ఆలయ నిర్మాణాన్ని ఎందుకు ఆపారో చెప్పగలరా.. అంత దమ్ము ఉందా... 


కరోనా వ్యాప్తి నియంత్రణలో విఫలం అయిన మీకు.. ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేక.. మీడియా ముందు నోటికి పని చెప్పడం కాదు..


ముందు రాష్ట్రాన్ని కరోనా నుంచి కాపాడండి... ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడండి.. 


సాయిరెడ్డి... మీకు చేతనైతే.. కరోనా వైరస్ ను ఎలా అరికట్టాలో, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలో..  ముఖ్యమంత్రి గారికి మంచి సలహాలు ఇవ్వండి... లేకపోతే అన్ని మూసుకుని కూర్చోండి. 


ఇప్పటికే మీ పరిపాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు... వైద్య సిబ్బంది ఇవ్వాల్సిన మాస్కులు, పిపిఇ కిట్లను మీరు, మీ నాయకులు కొట్టేసి వారికి అన్యాయం చేస్తున్న మీరు నీతులు చెపుతుంటే.. జనం నవ్వు కుంటున్నారు. 


మన రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన హెల్త్ యూనివర్సిటీస్ HOD లతో సమావేశమయ్యి వారి సలహాలు, సూచనలు ఇప్పటివరకు తీసుకోకపోవటం జగన్ రెడ్డి గారి అనుభవరాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.


పలువురు వైద్య రంగ నిపుణులు చేసే సూచనలు కూడా స్వీకరించలేని అథమ స్థాయికి ముఖ్యమంత్రి స్థాయిని తీసుకువచ్చారు.  


కనీసం ఈ సూచనలు కూడా చేయడం చేతగాని విజయసాయిరెడ్డి... మీకు రాష్ట్రం గురించి, రాజధాని గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది. 


స్పెషల్‌ స్టేటస్‌ పేరుతో అధికారంలోకి వచ్చి... దాన్ని అటక ఎక్కించి.. రాష్ట్రం నుంచి పరిశ్రమలను తోలేసి, వైజాగ్‌లో ఉన్న సాఫ్టవేర్ ఇండస్ట్రీని పంపేసి.. ఇప్పుడు రాజధాని మార్పు అంటూ పనికి మాలిన మాటలు మాట్లాడితే.. తగిన బుద్ది చెప్పాల్సి వస్తుంది. 


కేంద్రం నుంచి ఒక్క నయాపైసా తీసుకు రావడం చేతకాదు కానీ, రాజధాని మార్పు మాత్రం చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు.


- సుంకర పద్మశ్రీ
కాంగ్రెస్ మరియు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..