కాణిపాకం ఆలయంలో అన్యమతస్తులకు వసతి..!

కాణిపాకం ఆలయంలో అన్యమతస్తులకు వసతి..


వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన ఐవైఆర్
ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఐవైఆర్ డిమాండ్
అన్యమతస్తుల కోసం ప్రాంగణాన్ని వాడుతుండటంపై అభ్యంతరం
ఆలయ ప్రాంగణమా? లేక వసతి సదుపాయమా? అంటూ ప్రశ్న
హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందనే విషయం ఇప్పటికే రచ్చ రచ్చ అయింది. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రఖ్యాత కాణిపాకం ఆలయంలో అన్యమతస్తులకు ఏపీ ప్రభుత్వం వసతి ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐవైఆర్ అన్నారు. ఇది ఆలయ ప్రాంగణమా? లేక వసతి సదుపాయమా? అని నిలదీశారు. ఇంకెక్కడా వసతి సదుపాయమే లేనట్టు... దీన్ని అన్యమతస్తుల కోసమే వాడుతుండటంలో అంతరార్థం ఏమిటని మండిపడ్డారు. ఇతర మతస్తులను ఆలయ ప్రాంగణంలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రాంగణం నుంచి అన్యమతస్తులు వెలుపలకు వస్తున్న వీడియోను షేర్ చేశారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు