ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వం వెనకకు పోయేది లేదు :మంత్రి అనీల్ కుమార్ యాదవ్

అమరావతి, ఏప్రిల్ 16.(అంతిమ తీర్పు) : రాష్ర్టజలవనరుల శాఖమంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పాయింట్స్.
కోవిడ్ -19 తో రాష్ర్టం అట్టుడుకి పోతుంటే
రాష్ర్టానికి సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు రాష్ర్టంలో మొట్టమొదటి కేసు వచ్చిందగ్గర్నుంచి ప్రతి రోజూ రివ్యూచేస్తూ ఎక్కడ ఏ విధంగా చర్యలు చేపట్టాలి.ఏ విధంగా పేదలు,రైతులు
ఇబ్బంది పడకూడదని చెప్పి వారి బాగోగులు చూస్తూ కరోనాను ఎలా కట్టడి చేయాలా అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఇక్కడ మంత్రుల సబ్ కమిటి,జిల్లాలోమంత్రులు,నియోజకవర్గస్దాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసి కరోనా నియంత్రణకు పోలీసు,శానిటరీ,రెవిన్యూ,వైద్యఆరోగ్యసిబ్బంది అంతా డే అండ్ నైట్ కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు.ఒక జాతీయన్యూస్ ఛానల్ భారతదేశంలోనే  మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టేట్ ఇన్ లాక్ డౌన్ అని తీసుకుంటే  అది ఆంధ్రప్రదేశ్ గా పేర్కొంది.



లాక్డౌన్ లో కేసులు తగ్గించడంలోగాని,జాగ్రత్తలు తీసుకోవడంలోగాని మొట్టమొదటిస్ధానం ఏపికి వచ్చిందంటే ఈ రాష్ర్ట ముఖ్యమంత్రిగారి ముందుచూపే కారణం.


వాస్తవానికి చంద్రబాబునాయుడులాగా రోజూ వచ్చి అబద్ధాలు చెప్పడం హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టడం,దానిని ఒక ఈవెంట్ గా చేసుకునే
మనస్తత్వం జగన్ గారికి లెేదు.తనపని తాను చేసుకుంటూ పనిమాట్లాడాలి...పబ్లిసిటి కాదు అనే విధంగా మా ముఖ్యమంత్రిగారు ముందుకు వెళ్తుంటారు.అదే విధంగా పనులు జరుగుతున్నాయి.



రాష్ర్టం అంతా కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తన పంధా వీడటం లేదు.ఆయన ఈ రాష్ర్టంలో లేడు, పక్క
రాష్ర్టంలో ఉన్నాడు.ముసలివాళ్లు,చిన్నపిల్లలకు
జాగ్రత్తలు తీసుకోమంటున్నాం ,చంద్రబాబునాయుడు
వయస్సుపైబడింది కాబట్టి ఆయనను తిరగమని కాని, లేకపోతే ప్రజలకు దగ్గర ఉండాలని ఎవరూ కోరుకోరు.ప్రభుత్వం కూడా ఆయనను హౌస్ ఐసోలేషన్ లో జాగ్రత్తగా ఉండమని చెబుతోంది.


పక్కరాష్ర్టంలో కూర్చుని వాళ్ల చెంచాలతో అబద్దపు ప్రచారం,వెధవప్రచారం,తప్పుడు ప్రచారాలు,చిల్లరరాజకీయాలు  చేస్తున్నారు.కరోనా సమయంలో కూడా టిడిపి నేతలు
రాజకీయం చేస్తున్నారు.కనీసం చంద్రబాబు కూడా సహాయం చేయడం లేదు.టిడిపి నేతలు రాష్ర్టంలో ఎక్కడైనా ప్రజలకు సహాయం చేస్తున్నారా.అది కూడా లేదు.


ఈరోజు ఆయన రాలేదు.ఆయన కుమారుడుది వయస్సు చిన్నదేగా.ఆయనైనా కనీసం ఈ రాష్ర్టంలో ఉన్నాడా అంటే ఆయన ఎలా ఎక్కడకు పోయాడో కూడా తెలియదు.కాని తప్పుడు రాజకీయాలు చేస్తూ శునకానందం పొందుతున్నారు.


హైకోర్టు ఇంగ్లీషు మీడియంపై ఆదేశాలు ఇస్తే దానికి ఏదో సంబరపడిపోయి ప్రభుత్వం ఏదో ఇదైనట్లు వీళ్లేదో విజయం సాధించినట్లు ఈయన,రెండు
మీడియా ఛానల్స్ నానా హడావుడి చేస్తున్నారు.నేను సూటిగా అడుగుతున్నాను.మా విధానం ప్రతి ఒక్కరికి మంచివిద్య అందించాలి.బడగుబలహీనవర్గాలు,మైనారిటీల పిల్లలు కూడా పోటీ ప్రపంచంలో
ఉన్నతస్దానాలకు ఎదిగేవిదంగా చేయాలనేది మా ప్రభుత్వం లక్ష్యం.


ఇంగ్లీషు మీడియంపై ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వీరికి తెలుగంటే ఇష్టం లేదు.అని మాట్లాడుతున్నారు.తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతున్నాను,ఇంగ్లీషు మీడియం మీ బిడ్డలకేనా....పేదవర్గాలైన ఎస్సిఎస్టిబిసి మైనారిటీల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుకుని ఉన్నతస్ధాయికి పోగూడదా....



మీ బిడ్డలను ఎక్కడ చదివిస్తున్నారు.తెలుగుమీడియంపై అంతప్రేమ ఒలకబోస్తున్న మీరు గాని,మీ పత్రికాధినేతలు గాని వారిని సూటిగా అడుగుతున్నాను.అసెంబ్లీలో చంద్రబాబు కుమారుడు లోకేష్ చెబుతుంటారు.నేను అమెరికాలో స్టాన్ ఫోర్డ్ లో చదివాను చెబుతుంటాడు.


మీ బిడ్డలు మాత్రం అమెరికాలో చదవాలి, పేదవాడి బిడ్డలు మాత్రం తెలుగుమీడియంలో చదివి ఇక్కడే మగ్గిపోయి ఉండాలా...మీకు ఒక న్యాయం...పేదవాడికి ఒక న్యాయమా...


తమ బిడ్డను తెలుగుమీడియంలో చేర్పించిన ఒక్క తెలుగుదేశం నాయకుడుని చూపించండి.ఒక్కఎంఎల్ ఏను,మాజీమంత్రులను చూపించండి.చంద్రబాబునాయుడును అడుగుతున్నాను...నీ మనవడు దేవాంశు ఎక్కడ చదువుతున్నాడు.తెలుగుపై అంత ప్రేమఒలకబోస్తున్నావే.దేవాంశును తెలుగుమీడియంలో చేర్చవచ్చు కదా.


మీ పిల్లలు మాత్రం మంచిగా చదువుకోవాలి,నాలుగైదు
భాషలు నేర్చుకోవాలి.పెద్ద పెద్ద స్దాయికి వెళ్లాలి.పేదవారి బిడ్డలు మాత్రం
అడ్డడుగున ఉండిపోవాలి.


ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు 20 ఏళ్ల తర్వాత ప్రతిపేదవాడి బిడ్డ మంచిస్దాయిలో ఉండాలి.పోటీ ప్రపంచంలో పోటీపడేలా ఉండాలి
అని కోరుకుంటున్నారు,రాష్ర్టంలో 95 శాతం మంది
తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంగ్లీషు మీడియంలో చేర్పించాలనే ఏకభిప్రాయంతో ఉంటే దానిని కూడా రాజకీయం చేస్తున్నారు.


ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా....చంద్రబాబు ఆయన బినామిలు నారాయణ,చైతన్యసంస్ధలను బతికించుకునేదానికి ఈ
విద్యావ్యవస్ధలో ప్రైవేటీకరణ పెంచి గవర్నమెంట్ విద్యను నాశనం చేశారు.రాష్ర్టంలో పేదల బిడ్డల గురించి ఆరాటమనేదే లేదు.


ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వం వెనకకు పోయేది లేదు.ఖచ్చితంగా ప్రతి బిడ్డను ఒక మంచిస్ధాయిలో ఉండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారు.రాజీ ప్రశ్నేలేదు.



ప్రతి దానికి కోర్టుకు వెళ్లడం,సైంధవుడులా అడ్డుపడటం.కరోనా నేపధ్యంలో రాష్ర్టంలోఇంత జరుగుతుంటే మీరు ఎక్కడకు వెళ్లారు.చిల్లర
రాజకీయాలు చేయడంలో మాత్రం ముందుంటారు. 


ఎలక్షన్ కమీషనర్....దానికి సంబంధించి చూస్తే రమేష్ కుమార్ 
చేస్తున్నకార్యక్రమాలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి.కేంద్రహోంశాఖకు లెటర్ ఎవరు రాశారు అని ప్రశ్నిస్తే ఎప్పుడూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడలేదు.



కాని మా  పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ విజయసాయిరెడ్డిగారు ఒక లేఖ సంధించినప్పుడు మాత్రం నేనే రాశాను లేఖ అని చెప్పారు.ఈరోజు సూటిగా మూడుప్రశ్నలు అడిగాం.ఇది టిడిపి ఎంపి కనకమేడల వద్ద నుంచి వచ్చిన లెటర్ అవునా...కాదా...ఆయన డ్రాఫ్ట్ చేసింది కాదా...ఏ ఐపి అడ్రస్ నుంచి వచ్చింది అని అడుగుతుంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు.పోలీసు నిగ్గుతేలుస్తుంది అంటే అది అవసరం లేదంటాడు.ఎందుకు అవసరం లేదు.


నిజంగా మీరే డ్రాఫ్ట్ చేసిఉంటే మీకు భయం ఎందుకు ...ఇది ఏ ఆఫీసునుంచి వచ్చింది...ఎవరు డ్రాఫ్ట్ చేశారు....ఏ ఐపి నుంచి వచ్చింది అని తెలిస్తే మీ బంఢారం అంతా బట్టబయలవుతుంది.కాబట్టి భయపడి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు.


ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమీషన్ పై ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో అది తీసుకుంటుంది.మీరు ,తెలుగుదేశం
పార్టీ చెప్పినట్లు ఈ ప్రభుత్వం నడుచుకోవాలా అని అడుగుతున్నాం.


ప్రపంచం,దేశం,రాష్ర్టం అంతా కరోనా తో అల్లాడుతుంటే చంద్రబాబు బుర్రమాత్రం ఎల్లోవైరస్ తో నిండిపోయింది.వయస్సు అయిపోయింది.ఎటూ కుటుంబంతో పక్కరాష్ర్టంలో వెళ్లి దాక్కున్నావు.అక్కడే ప్రశాంతంగా ఉండు.


కాని నీ చెంచాలతో...తెలుగుదేశం పార్టీనేతలు ఎక్కడకు వెళ్లారో తెలియదు.ఆ పార్టీ నేతలు ఏ జిల్లాలో అయినా తిరిగారా...మాస్కులు లేవు.పిపిఏ కిట్స్ లేవని మాట్లాడుతున్నారు.ఎప్పుడైనా చూశారా.


ఈరోజు దేశంలోనే కరోనా నిర్ధారణకు హయ్యస్ట్ టెస్ట్ లు అంటే ప్రతిరోజు 2 వేల టెస్ట్ లు చేసే రాష్ర్టంలో ఏదైనా ఉందంటే అది ఏపి మాత్రమే.ఇంకా పెంచుతూపోతున్నాం.నాలుగువేల టెస్ట్ లు చేసే దిశగా
వెళ్తున్నాం.


అన్ని రకాలుగా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ముందుకు తీసుకువెళ్తుంటే కనీసం పిల్లికి బిఛ్చం పెట్టి ఉండరు.టిడిపి వారు సహాయం చేయకుండా చౌకబారు విమర్శలు చేయడంలో మాత్రం ముందుంటారు.  


పదిరోజులకొకసారి రావడం.... తప్పుడు విమర్శలు చేయడం....ఇంట్లోపోయి పడుకోవడం ఇది వారు చేసేపని.ఇలాంటి పనులు చేస్తుంటే మొన్న ప్రజలు 23 స్ధానాలకు పరిమితం చేశారు.ఈసారి మూడు లేదా రెండింటికి పరిమితం చేస్తారు.


ప్రభుత్వం చేస్తున్న మంచికి సహకరించకపోయినా పర్వాలేదు.ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కష్టపడుతుంటే వారి కష్టాన్ని అవహేళనగా,చులకనగా తప్పుడు ప్రచారాలు చేయవద్దని తెలియచేస్తున్నాం.