ఎం.ఎస్‌.ఎం.ఈ.లకు వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఊరట

30–04–2020
అమరావతి


ఎం.ఎస్‌.ఎం.ఈ.లకు వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఊరట


*కోవిడ్‌ –19 ప్రభావం నుంచి కాపాడేందుకు ఆర్థికరక్షణ ప్రణాళిక


*2014–15 నుంచి ఎంఎస్‌ఈలకు పెండింగులో ఉన్న బకాయిలు ఇవ్వాలని నిర్ణయం, మొత్తంగా రూ. 905 కోట్ల చెల్లింపులకు సీఎం నిర్ణయం*


*మే నెలలో సగం, జూన్‌ నెలలో సగం చెల్లించాలని నిర్ణయం*


*ఏప్రిల్, మే, జూన్‌.. ఈ మూడు నెలల కాలానికి ఎంస్‌ఎంఈలకు పవర్‌ డిమాండ్‌ ఛార్జీలు రూ. 188 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం*


*తక్కువ వడ్డీకి రూ.200 కోట్ల రూపాయలను వర్కింగ్‌కేపిటల్‌గా ఎంఎస్‌ఎంఈలకు అందించాలని నిర్ణయం*


*మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్‌)కరెంటు మినిమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపు వాయిదా* 


*కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు వచ్చాక టెక్ట్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి చర్యలు తీసుకుంటాన్న సీఎం*


అమరావతి: కోవిడ్‌–19 కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి పట్టాలకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు
ఎంఎస్‌ఎంఈలు సహా కీలక రంగాల్లోని పరిశ్రమలను ఆదుకునేందుకు చర్యలు 
క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్‌ జేఎన్వీ. సుబ్రహ్మణ్యం సహా ఇతర అధికారులు హాజరు


ఎంఎస్‌ఎంఈలను కాపాడేందుకు పలు రకాల ప్రతిపాదనలను నివేదించిన అధికారులు
గత సమావేశంలో సీఎం ఇచ్చిన సూచనల మేరకు ప్రతిపాదనలు చేసిన అధికారులు. ఈ ప్రతిపాదనలపై తీవ్ర చర్చ జరిగిన తర్వాత సీఎం ఈ కింద నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. 


1. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల బకాయిలు చెల్లింపు:


– 2014–15 నుంచి పెండింగులో ఉన్న ఎంఎస్‌ఈల ప్రోత్సాహకాల బకాయిలను పూర్తిగా చెల్లించాల నిర్ణయం. విలువ రూ. 905 కోట్లు
– మే నెలలో, జూన్‌ నెలలో చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయం.
– 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకూ గత ప్రభుత్దవం హాయంలో ఎంఎస్‌ఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లు చెల్లించలేదన్న విషయంపై సమావేశంలో చర్చ. 
– సంవత్సరాలవారీగా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల రూపంలో బకాయిలు 
2014–15లో రూ.43 కోట్లు
2015–16లో  రూ. 70 కోట్లు
2016–17లో రూ. 195 కోట్లు
2017–18లో రూ. 207 కోట్లు
2018–19లో  రూ. 313 కోట్లు
అప్పటివరకూ మొత్తం రూ. 828 కోట్లు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20 ఎంఎస్‌ఈలకు ( అప్‌లోడ్‌ చేసిన వివరాల ప్రకారం) బకాయిలు రూ. 77 కోట్లు.
మొత్తంగా రూ.905 కోట్లను మే, జూన్‌ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం ప్రకటన. 


2, ఏప్రిల్, మే, జూన్‌నెలలకు ఎంఎస్‌ఎంఈల మినిమం కరెంటు డిమాండ్‌ ఛార్జీల రద్దు:


– దీంతోపాటు  ఏప్రిల్, మే, జూన్‌నెలల కాలానికి ఎంఎస్‌ఎంఈల మినిమం విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలను రద్దుచేయాలని నిర్ణయం. దాదాపు రూ.188 కోట్లమేర అన్ని ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి.


పై రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎంఎస్‌ఎంఈలకు మేలు. వీటిలో 9,68,269 మందికి ఉపాధి. 


3. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈల తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ  సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు సమకూర్చుకుని, వాటిని వర్కింగ్‌ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయం. అతితక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్‌ కేపిటల్‌ సమకూర్చాలని సమావేశంలో నిర్ణయం.


4. టెక్స్‌టైల్‌ పరిశ్రమల సహా, భారీ, అతిభారీ పరిశ్రమలకు 3నెలల ( ఏప్రిల్, మే, జూన్‌ నెలల) మినిమమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయం. ఎలాంటి అపరాథరుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ భారాన్ని  రాష్ట్ర ప్రభుత్వమే మోస్తుంది. దీనివల్ల అన్ని పరిశ్రమలకూ అదనపు వర్కింగ్‌క్యాపిటల్‌ సమకూరుతుంది. 


5. టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించేదిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని సీఎం సమావేశంలో ప్రకటించారు. 


అంతేకాకుండా కోవిడ్‌–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను అదుకోవడానికి ఆలోచనలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వెలువడినత తర్వాత మరోసారి సమీక్షచేసి టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలనూ ఆదుకోవడానికి అన్నిచర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ  వైయస్‌.జగన్‌ సమావేశంలో స్పష్టంచేశారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image