తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళికలు*

*తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళికలు* వింజమూరు, ఏప్రిల్ 3 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) వింజమూరు మండలంలో ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నివారణా చర్యలు తీసుకునేందుకు అవసరమైన ప్రణాళికలను యుద్ద ప్రాతిపదికన రూపొందించాలని గ్రామీణ నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన వింజమూరులోని ఆర్.డబ్ల్యు.ఎస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మండలంలో నీటి సరఫరా చేస్తున్న ట్యాంకర్లుకు జియో ట్యాగింగ్ విధానమును అమలుపరచాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో తాగునీటి పధకాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వినియోగంలోకి వచ్చే వాటన్నింటికీ తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలందరికీ పుష్కలంగా నీరందించేందుకు అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన తాగునీటి అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా నివేదికలు రూపొందించాలన్నారు. పశువులు గణన మేరకు నీటి అవసరాలను తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఇ శ్రీనివాసులు, ఏ.ఇ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.