లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ వైన్ షాపుల్లో  మద్యం మాయం

లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ వైన్ షాపుల్లో  మద్యం మాయం


ఎమ్మిగనూర్, పెద్దకడబూరు, ఏప్రిల్, 18 (అంతిమతీర్పు):- కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోగల కోసిగి  ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ నాలుగు మద్యం షాపులు ఉండగా అవి ఒకటి  కోసిగి మండలంలోని మూడు మద్యం షాపులు,పెద్దకడబూరు మండలంలోని ఒకటి ప్రభుత్వ మద్యం ప్షాపులు ఉండగా కానీ పెద్దకడబుర్ లో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో 55 వేల రూపాయల విలువ చేసే  లిక్కర్ బాటిల్ మాయమైనట్లు కోసిగి ఎక్స్చేంజ్ సీఐ.లక్ష్మీదేవి విలేకరులకు తెలిపారు.ప్రభుత్వ  జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఫిజికల్ వెరిఫికేషన్ లో భాగంగా పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఉన్నా వైన్ షాప్ లోమొత్తం మద్యం బాటిల్ అన్ని మాయం అయ్యాయని వారు తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మద్యం షాపులను మార్చి 22వ తేదీన  ఎక్సైజ్ పోలీ సులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.అయితే బుధవారం ఎక్సైజ్ సీఐ. లక్ష్మిదేవి వైన్ షాప్ ను తెరిచి తనిఖీ చేయగా దాదాపుగా 55 వేల రూపాయల విలువ గల మద్యం బాటిళ్లు తక్కువగా ఉన్నాయని కోసిగి ఎక్స్చేంజ్ సీఐ.లక్ష్మీదేవి విలేకరులకు తెలిపారు.వైన్ షాపులో పనిచేసేసూపర్వైజర్,ఇద్దరు సేల్స్ మ్యాన్ లు వివరాల మేరకు మద్యం షాప్ సీజ్ చేసే  ముందురోజే 21వ తేదీన రాత్రిమద్యంబాటిళ్లుబయటకుతీసుకున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ మేరకు వారి వద్ద నుండి 55 వేల రూపాయలను  రికవరీ చేసి కేసు నమోదు చేశామని ఎక్స్చేంజ్ సీఐ తెలిపారు.వీరి వెంట ఆర్‌.ఆదామ్ , ఎక్సైజ్ ఎన్ఏ.అఖిల,మరియు సిబ్బంది పాల్గొన్నారు.