లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదు - బిజెపి జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు

లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదు - బిజెపి జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు
అమరావతి,  ఏప్రిల్: 14 :    కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని, ఏప్రిల్‌ 20 వరకు మాత్రం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు స్పష్టం చేసారని, ఈ సందర్భంగా కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ కాలంలో ఏడు సూత్రాలు పాటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారని, వీటిని కచ్చితంగా అమలు చేస్తే కరోనాపై విజయం సాధించవచ్చని చెప్పారని బిజెపి జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు తెలియజేశారు. వై.వి.సుబ్బారావు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని, వారి నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 20 తర్వాత కరోనా హాట్‌స్పాట్‌లు కానీ ప్రాంతాలతో షరతులతో కూడిన సడలింపు ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను రేపు విడుదల చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, అలాగే ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ నిబంధనలు విధిగా పాటించాలని వై.వి.సుబ్బారావు కోరారు. ఇళ్లలో ఉండే వృద్ధులు, ఇదివరకే ఆరోగ్య సమస్యలున్నవారి గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లాక్‌డౌన్, సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులను తప్పకుండా వాడండి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ చేసిన సూచనలను పాటించండి. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు. ఇతరులకు కూడా చెప్పండి. మీకు సాధ్యమైనంత పేద కుటుంబాలకు సాయపడండి. వారి ఆకలి తీర్చండి. సంపన్న ప్రజలు ముందుకు వచ్చి దేశంలోని పేదలకు సాయం చేయాల్సిన అవసరం వచ్చిందని, ముందుకు వచ్చి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీ వ్యాపారం, పరిశ్రమల్లో పనిచేసేవారి పట్ల సానుభూతితో ఉండండి. ఎవరినీ ఉద్యోగం నుంచి తీసేయొద్దు. వైద్యులు, నర్సులు, పోలీసులు ఇలా ఈ సంక్షోభ సమయంలో మనకు సేవలందిస్తున్నవారందరినీ గౌరవించాలన్నారు. మే 3 వరకూ లాక్‌డౌన్ నిబంధనలను పాటించి, ఎక్కడున్నవారే అక్కడే ఉంది, సురక్షితంగా ఉండాలన్నారు.