ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అండగా ఉంటా :ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్

ఉయ్యురు ,ఏప్రిల్ 8 :


కరోనా లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అండగా ఉంటా :ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్


ఈ రోజు ఉయ్యురు నగర పంచాయతీ 15 వార్డ్ లో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆర్థికసహాయంతో  *యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ చారిటబుల్  ట్రస్ట్* ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జంపన వీర శ్రీనివాస్  మరియు మాలావత్ నాగమణి పర్యవేక్షణలో 650 కుటుంబాలకు ఇంటింటికి కోడిగుడ్లు పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్* 


ఈ సందర్బంగా *రాజేంద్ర ప్రసాద్*  మాట్లాడుతూ కరోనా వలన ఉపాధి లేక పేద బడుగు బలహీన వర్గాలు ఇల్లు గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు వున్న ప్రతి కుటుంబానికి నెలకు 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేసారు. మా *రాజేంద్ర ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్* పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని *రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 


ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెక్క సుబ్బారావు, మిక్కిలినేని రాంమోహన్, కటారి తిరుపతి రావు,మరియు పెద్ద ఎత్తున 15వార్డ్ మహిళలు ప్రజలు పాల్గొన్నారు.