తిరుపతి లోపది రూపాయల వైద్యంకు చిరునామా డాక్టర్ వెంకట్రామా నాయుడు

*పది రూపాయల వైద్యంకు చిరునామా డాక్టర్ వెంకట్రామా నాయుడు జ్.
  తిరుపతి ఏప్రిల్,13 (అంతిమ తీర్పు) :   జలుబుకని చికిత్సకు వెళితే ఆస్తులు అమ్ముకునే లా వ్యవహరించే కార్పొరేట్ ఆస్పత్రులు బలపడుతున్న వేళ ... కేవలం 10 రూపాయలకే వైద్యాన్ని అందించాలన్న  పట్టుదలతో ఆసుపత్రిని నడుపుతున్న డాక్టర్ గురించి మనం తెలుసుకుందాం...
"మనం తినే అన్నం మనల్ని వెక్కిరించకూడదు... ప్రతిరోజూ నిద్రపోయే ముందు నేను ఎవరి సొత్తు అప్పనంగా తినలేదు" అనుకున్నాకే నాకు స్థిమితంగా నిద్రపడుతుంది అంటాడు డాక్టర్ వెంకట రామా నాయుడు అలియాస్ డాక్టర్ రాము తిరుపతి సిపిఎం కార్యాలయం సమీపంలో సుందరయ్య కాలనీ వద్ద ప్రశాంతి వైద్యశాల పేరుతో గత 25 సంవత్సరాలుగా క్లినిక్ నిర్వహిస్తున్నారు ఈ డాక్టర్...
25 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో క్లినిక్ తెరిచిన రోజుల్లో ఐదు రూపాయల ఫీజు తో ప్రారంభించారు పదేళ్ల తర్వాత పది రూపాయలు గా నిర్ణయించారు  ఆనాటి నుంచి గత 15 ఏళ్లుగా పది రూపాయల డాక్టర్ గా  తిరుపతి లో ప్రసిద్ధి పొందారు.  డాక్టర్ వెంకట రామానాయుడు  గత 30 ఏళ్లుగా నాకు దగ్గరగా తెలుసు... చిన్న నాటి నుంచి  మేమిద్దరం స్నేహితులం కూడా... నేనూ,  డాక్టర్ రాము ఒకే ఏరియాలో  అంటే తిరుపతి భవానీ నగర్ లో పెరిగాం... చదువు, కరాటే, పిల్లనగ్రోవి వాయించడం లోనూ చిన్ననాటినుంచే ప్రతిభ కనబరిచాడు... ఒక చిన్న గుడిసెలో తమ్ముళ్ళతో  కలిసి నివసించేవాడు... ఈ డాక్టర్ చదువుకునే రోజుల్లో ఒకరకంగా పేదరికానికి చిరునామాగా పెరిగాడు...
ఎంతటి పేదరికం అంటే  తన అవ్వ ' కిరోసిన్' బుడ్డీ కి పది పైసలు లేక  ' కిరోసిన్' పోయించకపోతే  వీధిలైట్ల దగ్గర కూర్చొని చదువుకునేంతగా...  
 చిన్నతనంలో తన ఇంటి ముందు డాక్టర్ చదువులు చదివే వాళ్ళు కోటు వేసుకుని వెళుతుంటే... వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు .... నేను ఎందుకు దరిద్రానికి చేరువు గా ఉన్నాను అని మదన పడని రోజులేదంటాడు.... దాన్ని కసి గా మార్చుకుని చదివిన వెంకట రామానాయుడికి ఎంబిబిఎస్ లో సీటు వచ్చింది.... కేవలం పది వేల రూపాయల కట్టలేక ఆ రోజుల్లో ఆ సీటును వదులుకున్నాడు తనకు తోడుగా ఉండమని చెప్పిన అవ్వ బలవంతంతో ల్యాబ్ లో సహాయకుడిగా చేరాడు...  అక్కడ ప్రయోగాలు చేస్తున్న వైద్య విద్యార్థులకు సహాయకుడిగా ఉండటమేమిటి? అని మదన పడేవాడు ... ఓ శ్రేయోభిలాషి సలహాతో బీఏఎంఎస్ (ఆయుర్వేద వైద్యులు) ఎంట్రన్స్ రాసి రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు...  ఆయుర్వేద డిగ్రీ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలని భావిస్తున్న తరుణంలో.. ...చదువు చెప్పిన  ఓ గురువు తనతో  పిజి సాధించలేని, చేతగాని వాళ్ళు సాకులు చెబుతూ ఉద్యోగం, సద్యోగమని డ్రామాలాడుతారని రెచ్చగొట్టటంతో తనెంటో చూపించాలని రేయింబవళ్ళు నిలికిడి లేకుండా చదివి .... పీజీలో సీటు సాధించి పీజీ పూర్తి చేశాడు... కేవలం 250 రూపాయల స్టైఫండ్ పై ఆధారపడి... ఇంటి నుంచి ఏమీ ఆశించకుండా తెలిసిన వాళ్ళ సహకారంతో చదువు పూర్తి చేసిన ఘనుడు వెంకటరామయ్య....
  ఈయన చదువు చూసి వెంకటగిరి రాజా గారి పిఏ తన కూతుర్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు నిజాయితీగా  ఈ డాక్టర్  నా దగ్గర వేసుకున్న ప్యాంటు, చొక్కా తప్ప మరేమీ లేవు అన్నీ ఆలోచించుకుని  మీ అమ్మాయిని ఇవ్వండి... అని నిజాయితీగా చెప్పుకున్నాడు   ... ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? డాక్టర్ కు మా  పార్టీతో సంబంధం లేకపోయినా.... ఒక మంచి స్నేహితుడుగా ముప్పై ఏళ్లు పైబడిన అనుబంధం మాది... పది రూపాయల ఫీజు ఏమిట్రా!? పడిన బాధలు చాలవా!? ఎప్పుడు తెలుసుకుంటార్రా?! అని బంధువులు, కొందరు స్నేహితులు, పలువురు తనను మానసికంగా వేధించినా, ఇబ్బంది పెట్టినా తాను అనుకున్న పద్ధతిని మార్చుకోనని కరాఖండిగా చెప్పేశారు... తన జీవితంలో తన భార్య కీలకమైన పాత్ర పోషించిందని... పిల్లల చదువులు, ఆర్థికంగా నిలబెట్టడంలో ,ఆస్పత్రిలో తనకు సహకరించడం ద్వారా  తన కుటుంబ ఎదుగుదలకు మూల స్తంభం గా నిలిచింది అని అంటారు నిజాయితీగా ఈ డాక్టర్... చెప్పటం మరిచాను ... ఇప్పుడు వెంకట్రామా నాయుడు కుమార్తె డాక్టర్ కోర్స్ చదువుతుంది, కుమారుడు ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోకి అడిగిడ బోతున్నాడు అనుకున్న లక్ష్యానికి ఎన్ని ఆటంకాలొచ్చినా ఎదురొడ్డి నిలబడి ' పది రూపాయల డాక్టర్' గా ప్రసిద్ధికెక్కిన వెంకట్రామా నాయుడు అలియాస్ డాక్టర్ రాముకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను... కందారపు మురళి , జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐ టి యు తిరుపతి


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image