ప్రపంచమంతా స్తంభించినా వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు ఆగటం లేదు : కళా వెంకట్రావు

 29.04.2020


ప్రపంచమంతా స్తంభించినా వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు ఆగటం లేదు


.............కళా వెంకట్రావు


కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంతా స్తంభించినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ నేతల అక్రమాలు,అరాచకాలు, అవినీతి  కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమంగా మద్యం, ఇసుక అమ్ముకుంటున్నారు, రేషన్ బియ్యం దోచుకుంటున్నారు, భూములు కబ్జా చేస్తున్నారు.  మరో వైపు వాలంటీర్లు గ్రామాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే దిక్కు, కానీ వైసీపీ నేతలు కకక్కుర్తి తో పేదల నోటి కాడి కూడు కూడా లాగేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి కి సంబంధించిన ట్రస్ట్  కి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ పట్టు బడ్డారు. కానీ దీనిపై ఇంత వరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎందుకు స్పందించలేదు.దీనిపై విచారణ జరిపి ఎంపీ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు. వైసీపీకి తమ తప్పుల్ని టీడీపీ పై కి నెట్టడం అలవాటు, కానీ ప్రజలు నమ్మకపోయే సరికి నోరు లేని మూగ జీవాలపైకి నెడుతున్నారు. అద్దంకి లో   లాక్ డౌన్ నింబంధనలు ఉల్లంగించి అక్రమంగా మద్యం అమ్ముకుని ఎలుకలు తాగాయాని  అనటం వింతగా ఉంది.  నేడు ఇసుక అక్రమంగా దోచేస్తున్నారు, రేపు విచారణ లో ఆకలేసి ఇసుకను చేపలు తినేశాయని చెబుతారేమో. దొంగకు దొరికింది ఛాన్స్ అన్నట్లుగా వైసీపీ నేతలకి లాక్ డౌన్ కలిసొచ్చింది. ప్రజలంతా ఇళ్లలో ఉంటే వైసీపీ నేతలు విశాకలో భూములు కబ్జా చేసి గుట్టు చప్పుడు కాకుండా లేఅవుట్లు వేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఏమో వలంటీర్లు రేషన్ డోర్ డెలివరీ చేస్తూ ప్రజలకు సేవలు చేస్తున్నారని అంటారు. వాస్తవానికి మాత్రం వలంటీర్లు నాటు సారా కాసి ఇంటిటికీ  కాసి డోర్ డెలివరీ చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వైసీపీ నేతల అక్రమాలపై ముఖ్యమంత్రి  జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.  తన కమీషన్ల కోసం కామ్ గా ఉన్నారా? మంత్రులు ప్రజా సేవ   చేయటం కంటే ప్రజా ధనం దోచుకోవటంలో పోటీ పడుతున్నారు. వైసీపీ నేతలు కలలో కూడా చంద్రబాబు నాయుడు ని చూసి భయ పడుతున్నారు. మంత్రులు తమ పదవులు కాపాడుకునేందుకే టీడీపీని, చంద్రబాబు నాయుడు ని విమర్శిస్తున్నారు. 


S/D


కళా వెంకట్రావు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image