రంగంపేట , చప్పిడి ఎస్.సి.కాలనీ, ఊటబావుల పల్లిలో జిల్లా కలెక్టర్  పర్యటన 

 


రంగంపేట , చప్పిడి ఎస్.సి.కాలనీ, ఊటబావుల పల్లిలో జిల్లా కలెక్టర్  పర్యటన 


చంద్రగిరి నియోజక వర్గం,  ఏప్రిల్ 29: 


చంద్రగిరి మండలం  రంగంపేటలో  జిల్లా కలెక్టర్ పర్యటన : చంద్రగిరి తహశీల్దార్ చంద్రమోహన్ కలెక్టర్ కు వివరిస్తూ రంగంపేట ప్రజల సహకారంతో పూర్తిగా లాక్ డౌన్ అమలుచేస్తూ నిత్యవసర వస్తువులు ఇంటికే పంపిణీ చేస్తున్నాము, అలాగే నేటి నుండి ఇస్తున్న రేషన్ కూడా వాలింటర్ల సహకారంతో ఇఒటివద్దకే అందిస్తున్నామని, ఆర్.ఓ.వాటర్ , మెడిసన్స్, కూరగాయలు కూడా ఇంటివద్దకె పంపిణీ చేస్తున్నామని కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని 0877 2244777 , మంచి రెస్పాన్స్ వచ్చి ఇళ్లకే పరిమితమయి కావలసిన వస్తువులు అడుగుతున్నారని 320 కి పైగా పంపిణీ చేశామని తెలిపారు. శానిటేషన్ పై దృష్టి పెట్టాలని, లక్ డౌన్ పగడ్బందీ వుంటే కేసులు తగ్గే అవకాశం వుంటుందని  కలెక్టర్ సూచించారు. 


చిన్న గిట్టిగల్లు మండలం , చప్పిడి ఎస్సీ కాలనీ పర్యటన : ఎవరితో కాంటాక్ట్ లేని వ్యక్తిని గుర్తించిన ఆశా వర్కర్ చంద్రకళ ను జిల్లా కలెక్టర్ అభినందించి మాట్లాడారు. చంద్రకళ వివరిస్తూ సర్వేలో అనుమానం వచ్చి బాకరాపేటలో పరీక్షలు నిర్వహించనని, ఇక్కడే ఒకరికి జీప్ వుంటే వాటిలో తీసుకురమ్మని తెలిపానని, ఇంటికే పరిమితమయ్యే ఆమె ఒక్క సారి మాత్రమే బాకరాపేట లోని బ్యాంకుకు వచ్చిందని, ఎవరితో కాంటాక్ట్స్ లేవని,  6 మంది  కుటుంబ  సభ్యులు ఈ నెల 22 నుండి క్వారేం టైన్ లో వున్నారని వివరించింది. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు తెసుకెళ్లిన డ్రైవర్ తో పాటు , ఇక్కడ వున్న 27 ఇండ్లల్లో 50 వయస్సు పైబడిన వారికి శాంపిల్స్ పంపే  ఏర్పాటు చేయాలని డా.డా.శృతి భాగ్యం, తహసీల్దార్ దస్తగిరయ్య, ఎంపిడిఓ శ్రీనివాస ప్రసాద్ కు సూచించారు. కలెక్టర్ పర్యటనలో రెవెన్యూ , వైద్య అధికారులు ,  ఎస్.ఐ.రవికుమార్ వున్నారు. 


ఎర్రావారి పాలెం మండలం, ఊటబావుల పల్లి పర్యటనలో:  డాక్టర్ కృష్ణ చైతన్య వివరిస్తూ  ఇక్కడ పాజిటివ్ సోకిన వ్యక్తి ఇక్కడ జరిగిన బర్తడే ఫంక్షన్ హాజరు అయ్యారని 21 న పాజిటివ్ వచ్చిదని తెలిపారు. పాజిటివ్ వ్యక్తి భర్త ఎసి మెకానిక్ గా తెలిసిందని తెలిపారు. కాంటాక్ట్ 37 మందిని గుర్తించి క్వారెన్ టైన్ చేశామని తెలిపారు. ఇదే గ్రామంలో పాలు ఎవరూ కొనడంలేదని ఫిర్యాదు వచ్చిందని ఇదే గ్రామంలో వాడే విధంగా కొన్ని రోజులు చూడాలని, అపోహలు పోయేదాక తప్పదని అన్నారు. బర్తెడే జరిగిన కుటుంబంతో కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వుందని పక్షన్లు వద్దన్నా వినకపోతే ఎలా అని అన్నారు. 50 వయస్సు పైబడిన వారిని గుర్తించి టెస్ట్ లు చేయాలని తెలిపారు. ఒక్కరు చేసే తప్పు సమాజం ఎఫెక్ట్ చూసారా అన్నారు. శానిటేషన్ లో అధికంగా బ్లీచ్ వాడరాదని పొల్యూషన్ అవుతుంది, అవసరం మేరకు వాడాలని సూచించారు.  తహశీల్దార్ భాగ్యలక్ష్మి , ఎంపిడిఓ మురళీమోహన్ ఈ గ్రామంలో ఇంటివద్దకే అత్యవసర వస్తువుల పంపిణీ చేస్తున్నామని , పశుగ్రాసం కూడా  అందిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ పర్యటనలో సిఐ మురళీకృష్ణ , రెవెన్యూ , వైద్య అధికారులు , పోలీస్ వున్నారు.