మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి శంకరనారాయణ

*పెనుకొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి శంకరనారాయణ*


*రైతులు నష్ట పోకుండా గిట్టుబాటు ధర అందించి మొక్కజొన్న కొనుగోళ్లు*


*పెనుకొండ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 500 పైగా మొక్కజొన్న కోనుగోలు చేసాం*


*ఉధ్యాన వన రైతులను, పండ్ల తోట రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది*


*పరిశ్రమలకు జివో 151 నుండి మినహాయింపులు ఇచ్చి, పెనుకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో వున్నారు*


*పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న గౌ. ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు*


*మంత్రి శంకరనారాయణ*


అనంతపురం, పెనుకొండ:- 27.04.2020


కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ ప్రభావం రైతాంగానికి భారం కాకూడదని, రైతులు నష్ట పోకూడదు అనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ మాలగూండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. సోమవారం ఉదయం పెనుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలన్ని మంత్రి శంకరనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు లాక్ డౌన్ నేపథ్యంలో పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడి నష్ట పోకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు సమీక్షలు జరిపి కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు రైతులను ఆదుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుటున్నారని మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగా మొక్కజొన్న రైతులను ఆదుకునే దిశగా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా రైతుల వద్ద పంటను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 1760 చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  పెనుకొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో దాదాపు 500 క్వింటాలకు పైగా మొక్కజొన్న పంటను సేకరించడం జరిగిందని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ ప్రభావం వలన సరైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు లేకపోవడం పతనమౌతున్న ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనతో సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రైతులను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఉధ్యాన వన రైతులు పండించిన చీని, బొప్పాయ, ద్రాక్ష, అరటి, మామిడి, దోస కాయ, దాన్నిమ్మ, వాటర్ మెలన్ వంటి పండ్ల తోటల రైతులు నష్టపోకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రవాణా సదుపాయాలు కల్పించడం, జిల్లాలో కూడా రైతుల వద్ద నుండి పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతపురం జిల్లాలో మొక్కజొన్న, బెంగాల్ గ్రామ్, వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కనేకల్ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 


*రానున్న రోజుల్లో పెనుకొండ నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో వున్నారని, ఆ దిశగా పెనుకొండ ప్రాంతంలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ సంస్థ వీరా వాహన సంస్థను ఏర్పాటు చేసేందుకు అలాగే ఏరో స్పేస్ డిఫెన్స్ ఎకాడమి ఏర్పాటు చేసేందుకు అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం, గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేశారని మంత్రి శంకరనారాయణ తెలిపారు. గతంలో ఈ ఫ్యాక్టరీలు రావడానికి అడ్డంకిగా వున్న జివో 151 నుండి పరిశ్రమలకు  ఏపి ప్రభుత్వం మినహాయింపులు ఇవ్యండంతో పైన పేర్కొన్న పరిశ్రమల ఏర్పాటుకు లైన్ క్లియరైనట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన 151 జివో ప్రకారం కాలుష్య నివారణకు పరిశ్రమల ఏర్పాటును నిషేధం విధించిందని, ఐతే కియా పరిశ్రమనుండి వీరా వాహన మరియు ఏరో స్పేస్ డిఫెన్స్ సంస్థలు ఒకదానికొకటి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటం, అంతేకాకుండా ఈ పరిశ్రమలనుండి పర్యావరణానికి ముప్పు లేదని నిర్థారణ అయిన తర్వాతే గౌ. జగన్మోహన్ రెడ్డి గారు జివో 151 నుండి ఈ పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్యడం జరిగిందని తెలిపారు. వెనుకబడిన అనంతపురం జిల్లా, ముఖ్యంగా పెనుకొండ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కొరకు 
తన పూర్తి సహాయ సహకారాలను, తోడ్పాటును అందిస్తున్న గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 



ఈ కార్యక్రమంలో ఏవో రాకేష్ నాయక్, ఎంపిడిఓ శివశంకరప్ప, ఎమ్మార్వో నాగరాజు, సిఐ శ్రీహరి, ఎస్సై హరూన్ బాషా మండల వైసీపీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, సోమందేపల్లి పట్టణ కన్వీనర్ వెంకటరత్నం, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పట్టణ కన్వీనర్ తయూబ్, శంకర రెడ్డి, గుట్టూరు శ్రీరాములు, నాగలూరు బాబు, మునిమడుగు శ్రీనివాసులు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు. 


 


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image