*ఆనాడు అంటరానితనం నిర్మూలన ........నేడు అంటరానితనమే కరోనా నియంత్రణ*
*ఆనాడు చావుకూడా పెల్లిలాంటిదే...........నేడు కరోనా చావు పగవాడిక్కూడా వద్దు*
విజయవాడ ఏప్రిల్..27..
కాలం మారింది ఈ కలికాలంలో కరోనా కోవిడ్ 19 వైరస్ ప్రపంచ దేశాలను కరాళ నృత్యం తో అల్లాడిస్తుంది మనం మృత్యువాత పడకుండా ఉండాలంటే అంటరానితనం పాటించాల్సిందే పూర్వీకులు అంటరానితనం పాటిస్తే సంఘసేవకుల ,దేశోద్ధారకులు, చరిత్ర మూలపురుషులు అంటరానితనంపై ఉద్యమాలు చేశారు ఫలితం సాధించి ప్రజలందరూ సమానులే ఎలుగెత్తి చాటారు ....
నేడు పరిస్థితులు మారాయి దూరంగా దూరంగా ఉండాలని పాలకులే పదే పదే చెబుతున్నారు వారి సూచనలు పాటించండి ..కరోనా కేసుల సంఖ్యలు పెరిగి బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు ఇంకా జనాల్లో జంకు బొంకు లేదు
పోలీసులు, వైద్యులు , నర్సులు,వార్డు వాలేంటీర్లు, చివరకు జర్నలిస్టులు కూడా కరోనా బారినపడి మృత్యు భయంతో విలవిల్లాడుతున్నారు .....
ఇంటినుండి బయటకు రావద్దు...ఇంట్లోకి కరోనా తేవద్దని .అధికారులు నెత్తీనోరు మొత్తుకొంటున్నా ప్రజలు వినడంలేదు ఏదోవిధంగా బయటకు వస్తున్నారు .........
స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అని... ఆకలిరాజ్యం..సినిమాకు రాసిన పాటలో మనసుకవి ఆచార్య ఆత్రేయ తెలిపారు అంటే పెళ్లికి దూరపు బంధువులు వస్తారు చావుక్కుడా బంధువులు వస్తారు పెళ్లి చావుకూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి...
నేడు పెళ్లికూడా చేసుకునేందుకు వీలు లేక వాయిదాలు పడుతున్నాయి .....కరోనా చావు వాయిదా పడదుగా .... గ్రహచారం బాగుండక కరోనా కాటేసి మృత్యువాత వాత పడితే .......
పురాణాలు పుక్కిట పట్టినవారి కొడుకు కూడా మనల్ని పున్నామ నరకంనుండి తప్పించడానికి తలకొరివి పెట్టె అవకాశం ఉండదు ......పాడే మోయడానికి ...నలుగురు....కూడా ముందుకు రారు........ బతికున్నాళ్లు ....అమ్మా నాన్న, భార్యాబిడ్డలు కోసం తహతహలాడినవారంతా ...అభాగ్యులుగా అనాధాలుగా .....
దిక్కులేని శవాలుగా హంగు ఆర్భాటంలేని ,కనీసం అంతిమయాత్ర కూడలేని స్థితికి తెచ్చుకోవడం కోసం నిబంధనలు ఉల్లంఘించి బయట తిరగొద్దు ........
బయటకు రాకుంటే ప్రాణం పోదు...బయటకు వస్తేనే చస్తాం ....
కంటికి కనిపించని కరోనా నగరంలో ,రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో సర్వాంతర్యామిలా విస్తృతంగా ప్రభావం చూపుతుంది .....
ప్రపంచంలో ప్రసిద్ద దేవాలయాలు ,ప్రార్ధనా మందిరాలు మూతపడ్డాయి ఏదేవుడూ మనల్ని కపడలేరు .....స్వీయనియంత్రనే మనకు రక్ష అందుకే ప్రభుత్వ అధికారులు సూచనలు పాటించండి ....
ఇంటినుండి బయటకు రాకుండా కరోనా నియంత్రణలో భాగస్వాములు కండి......
చెప్పి చెప్పి విసుగెత్తి నిరంతర కర్వ్యూ వరకు తెచుకోవద్దు.......
మాస్కులు ధరించండి ...భౌతిక దూరం పాటించండి......లేకుంటే భౌతికకాయంగా మారతారు ...జాగ్రత్త....... ఇట్లు...... యేమినేని వెంకటరమణ ...ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి.......