మానవ సేవే మాధవ సేవగా భావించాలి : ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్

మానవ సేవే మాధవ సేవగా భావించాలి : ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్


     ఉయ్యురు, ఏప్రిల్ 14,(అంతిమ తీర్పు) :    ఉయ్యురు నగర పంచాయతి 12 వార్డులో  12 వార్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బూరెల నరేష్  పర్యవేక్షణలో  600 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్* 


ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి పేద, మధ్యతరగతి  కుటుంబాలకు శాపంగా మారిందని, చాలా మంది ఇల్లు గడవక పస్తులు ఉండే  పరిస్థితి ఏర్పడింది అని, మనమంతా ఇలాంటప్పుడే కలిసి కట్టుగా ఉండి *మానవ సేవే మాధవ సేవగా* భావించి సేవా కార్యక్రమాలు చెయ్యాలని, ఈ రోజు కార్యక్రమం చేపట్టి రకరకాల కూరగాయలు ఇంటింటికి పంచుతున్న 12 వార్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ ని మరియు బూరెల నరేష్ ని అభినందిస్తున్నానని *రాజేంద్ర ప్రసాద్*  అన్నారు. 


ఈ కార్యక్రమంలో కూనపరెడ్డి వాసు, పొగిరి రాము, పాండ్రాజు చిరంజీవి, జంపన వీర శ్రీనివాస్, నడిమింటి పైడయ్య, ఈడే అంజి, A.నజీర్, పలియాల శ్రీను, బోనంగి సత్యం, జ్యోతి గారు, మూర్తిగారు, కన్నారావు, నెల్లి రాంబాబు, g.శివ, రామిశెట్టి శ్రీను మరియు 12 వ వార్డు యూత్  ఫ్రెండ్స్ సర్కిల్ వార్డ్ ప్రజలు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.