చంద్రబాబు హోమ్ క్వారంటయిన్  లో ఉండి ఉత్తరాలు రాస్తున్నారు


09 - 04 - 2020
విజయవాడ


కనపడని శత్రువుతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది.
చంద్రబాబు హోమ్ క్వారంటయిన్  లో ఉండి ఉత్తరాలు రాస్తున్నారు.
మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు.


వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని,  ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసి చంద్రబాబు నీతులు చెప్తున్నారు అని మంత్రులు కన్నబాబు, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.


గురువారం కెబీఎన్ కళాశాల వద్ద జరిగిన పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం లో మంత్రి కన్నబాబు అతిధి గా పాల్గొన్నారు...


ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేదలకు సాయం చేయాలని నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాం అన్నారు.


ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు లేఖలు రాస్తున్నారు.


కరోన వైరస్ ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.


బీజేపీ, సీపీఐ, జనసేన,పార్టీలు చంద్రబాబు తోక పార్టీల మాదిరిగా  వ్యవహరిస్తున్నాయి.


అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ...
కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి మంత్రులు ముందుకు వస్తున్నారు.


ఒక్కో నియోజకవర్గంలో 40 వేల మందికి నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేస్తున్నాం.


సోషల్ డిస్టన్స్ ద్వారా  ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాం.


కరోన పోరులో ప్రజలకు వైద్యంతో నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా చాలా అవసరం.


చంద్రబాబు ఇంకా భ్రమలో ఉన్నారా లేకా నైజం అలా ఉందొ అర్థం కావడం లేదు.


వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదు.


ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసి చంద్రబాబు నీతులు చెప్తున్నారు.


విపత్కర పరిస్థితిలో మీ పాలన ఎలా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలు చెప్తున్నారు.


టీడీపీ అధికారంలో ఉండగా టమాటకు గిట్టుబాటు ధరలు కల్పించారా అని ప్రశ్నించారు.


నష్టం వచ్చిన మొక్కజొన్న, జొన్న, రబి, టమాటా, అరటి కొనుగోలు చెస్తున్నాం.


కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి న్యాయం చెయ్యమని చంద్రబాబు ఎందుకు లేఖ రాయడం లేదు.


పోస్టు కార్డుల ఉద్యమంలాగా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు.


విపత్తులు వస్తే రాజకీయ రాబంధులాగా ఆనంద పడుతున్నారు.